Balakrishna: భారీ గా పెరిగిన బాలయ్య మార్కెట్…సూపర్ హిట్ పడితే కలెక్షన్ల వర్షం కురుస్తుందా..?

చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో మార్కెట్ ని సంపాదించుకున్న హీరో కూడా బాలయ్య బాబే అని చెప్పడంలో ఎంత మాత్రం అతి శయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఆయన సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే 200 కోట్ల వరకు వసూళ్లను కలెక్ట్ చేస్తుందనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : May 19, 2024 9:48 am

Balakrishna

Follow us on

Balakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ.. ఇక ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా వరుసగా మూడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక దాంతో ఒక్కసారిగా బాలయ్య బాబు మార్కెట్ విపరీతంగా పెరిగిందనే చెప్పాలి.

ఇక సీనియర్ హీరోల్లో చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో మార్కెట్ ని సంపాదించుకున్న హీరో కూడా బాలయ్య బాబే అని చెప్పడంలో ఎంత మాత్రం అతి శయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ఆయన సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే 200 కోట్ల వరకు వసూళ్లను కలెక్ట్ చేస్తుందనే చెప్పాలి. ఇక దానికి తగ్గట్టుగానే వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను నమోదు చేశాడు. ప్రస్తుతం చేస్తున్న బాబీ సినిమాతో కూడా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 అనే సినిమాని తెరకెక్కించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఈ సినిమాతో మరోసారి బాలయ్య బాబు 200 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి సీనియర్ హీరోలలో టాప్ హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి బాలయ్య బాబు అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ను నమోదు చేసి మంచి కలెక్షన్స్ రాబడతాడా అనే అనుమానలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ అటు ప్రేక్షకులను అలరిస్తూనే, తన అభిమానులకు బూస్టప్ అయితే ఇస్తున్నాడు.

ఇక మొత్తానికైతే నందమూరి నటసింహంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య ఎక్కడ తగ్గకుండా సినిమాలు చేయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది…