Krishna Vamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ కృష్ణవంశీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు ఆయనను ప్రేక్షకులకు చాలా దగ్గర చేశాయి. ముఖ్యంగా ఒకప్పుడు ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకుడిలో విపరీతమైన అంచనాలు అయితే ఉండేవి. అందువల్లే ఆయన సినిమాలు ప్రేక్షకులను అలరించడం లో ఎప్పుడూ సక్సెస్ అవుతూ ఉండేవి.
ఇక ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించడంలో తనను మించినవారు మరొకరు లేరు అనేంతలా సినిమాను చేస్తూ మంచి గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా కృష్ణవంశీ సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన నా ‘ఉచ్చ్వాసం కవనం’ అనే ప్రోగ్రాం లో పాల్గొన్నారు. ఇక మే 20వ తేదీన సీతారామశాస్త్రి జయంతి ఉన్న నేపథ్యంలో ఈ ప్రోగ్రాం ని నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో పాల్గొన్న కృష్ణవంశీ సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ముఖ్యంగా ‘1989 నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది. నన్ను తన సొంత కొడుకు లాగా స్వీకరించి తన ఇంట్లోనే ఉంచుకున్నారు.
నేను ఒక కథ రాసుకున్నప్పుడు ముందుగా ఆయనకి చెప్పేవాడిని దానికి సంబంధించిన పాటలను ఆయన రాస్తూ ఉండేవాడు. ఇప్పుడు గత ఆరు నెలల నుంచి నేను ఒక సినిమాని చేయాలని అనుకుంటున్నాను. కానీ నా కథలు చెప్పడానికి ఆయన లేడు. ప్రస్తుతం నేను ఇండస్ట్రీలో ఒంటరి వాడిని అయ్యాను. అనాథలా మిగిలిపోయాను’ అంటూ కృష్ణవంశీ ఆయన గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. నిజానికి కృష్ణవంశీ, సీతారామశాస్త్రి మధ్య అప్పట్లో మంచి బాండింగ్ అయితే ఉండేది.
ఒకానొక సమయంలో కృష్ణవంశీ సీతారామశాస్త్రి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ సినిమాలు చేస్తూ వచ్చాడు. సీతారామ శాస్త్రి కృష్ణవంశీ ని దత్తత కూడా తీసుకున్నాను అంటూ కొన్ని కామెంట్స్ చేయడం అప్పట్లో పెను సంచలనాలను సృష్టించింది. ఇక మొత్తానికైతే వీళ్ళ మధ్యన ఉన్న బాండింగ్ అనేది చాలా గొప్పదనే చెప్పాలి…