Nagarjuna Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా బాట పడుతున్నారు. పాన్ ఇండియా సినిమాలను చేస్తూ భారీ స్టార్ డమ్ ను సంపాదించుకున్నాం అంటూ గొప్పలైతే చెప్పుకుంటున్నారు. నిజానికి ఒకప్పుడు నాగార్జున పాన్ ఇండియా హీరోగా చాలా సినిమాలు చేశారనే విషయం మనలో చాలామందికి తెలియదు. మణిరత్నం, రాంగోపాల్ వర్మ, ఫాజిల్, మహేష్ భట్ లాంటి జాతీయ స్థాయి దర్శకులతో సినిమాలు చేసి తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. శివ, గీతాంజలి, రక్షకుడు, క్రిమినల్ లాంటి సినిమాలు అతనికి పాన్ ఇండియాలో మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. అప్పట్లో నాగార్జున నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉండేవి…డిఫరెంట్ సినిమాలు చేయడంలో ఆయన ఎప్పుడు ముందు వరుసలో ఉన్నాడు. ఇక కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో కూడా ఆయన చాలావరకు ఆసక్తిని చూపిస్తూ ముందుకు సాగిన విషయం మనకు తెలిసిందే…
కామెడీ ప్రాధాన్యం ఉన్న సినిమాలైన, రొమాంటిక్ సినిమాలైన, థ్రిల్లర్ సినిమాలైనా ఎలాంటి జానర్ సినిమాలైనా సరే తన మార్కు చూపిస్తూ ప్రేక్షకులు చేత శభాష్ అనిపించుకున్న నటుడు కూడా నాగార్జున నే కావడం విశేషం… నాగార్జున ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 39 సంవత్సరాలు గడుస్తోంది… ఇప్పటికి ఆయన యంగ్ హీరోలకు పోటిని ఇస్తూ కొత్త కథలను ఎంచుకొని ఇప్పుడు కూడా వరుస సినిమాలతో సక్సెస్ లను సాధించడమే టార్గెట్ గా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి… నిన్నే పెళ్ళాడుతా లాంటి ఒక ఫ్యామిలీ సినిమా చేసిన తర్వాత అన్నమయ్య లాంటి భక్తి రస ప్రధానమైన చిత్రాన్ని చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక అందులో ఓల్డ్ ఏజ్ లో ఉండే నాగార్జున నటన చాలా అద్భుతంగా ఉంటుంది. నిజానికి అలాంటి పాత్రని అప్పట్లో ఏ స్టార్ హీరో కూడా యాక్సెప్ట్ చేసేవాడు కాదు.
ఎందుకంటే యంగ్ ఏజ్ లో ఉండి మంచి సినిమాలు చేస్తున్న సమయంలో ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్లు చేయడానికి ఏ హీరో ఒప్పుకోడు కానీ నాగార్జున మాత్రం దాన్ని ఒక చాలెంజింగ్ గా తీసుకొని ఆ క్యారెక్టర్ లో సైతం చేసి మెప్పించాడు…ఈ 39 సంవత్సరాల కెరియర్ లో ఎన్నో సాహసాలను చేసి ఎన్నో ప్రయోగాత్మకమైన సినిమాలను ప్రేక్షకులకు అందించి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులు అందరు ఇష్టపడేలా తనను తాను మార్చుకున్నాడు. మరి మొత్తానికైతే ఇప్పటికి ఆయన ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…