Nag Ashwin: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లెక్కలు మార్చేసిన నాగ్ అశ్విన్…ఎవరి పొజిషన్ ఏంటి అంటే..?

నాగ్ అశ్విన్ కూడా స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు..ఇక ఈ లిస్టును కనక మనం ఒకసారి చూసుకున్నట్లైతే మొదటి వరుసలో రాజమౌళి ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ లాంటి దర్శకులు ఉన్నారు.

Written By: Gopi, Updated On : June 28, 2024 8:31 am

Nag Ashwin

Follow us on

Nag Ashwin: కల్కి సినిమాతో పాన్ ఇండియా లో ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టించిన నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక మహానటి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఆయన పాన్ ఇండియాలో టాప్ పొజిషన్ కి వెళ్లడం అనేది నార్మల్ విషయం కాదు. ఇక కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టించడమే కాకుండా ఇప్పుడు మరికొన్ని కొత్త రికార్డ్ లను సృష్టించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

అందువల్లే ఈ సినిమాకి భారీ సక్సెస్ తగ్గింది. కాబట్టి నాగ్ అశ్విన్ కూడా స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు..ఇక ఈ లిస్టును కనక మనం ఒకసారి చూసుకున్నట్లైతే మొదటి వరుసలో రాజమౌళి ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ లాంటి దర్శకులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సూపర్ సక్సెస్ లు కూడా సాధిస్తున్నారు… అయితే మొన్నటిదాకా అసలు పాన్ ఇండియా డైరెక్టర్ల లిస్టులోనే లేని నాగ్ అశ్విన్ పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా ఎదగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

ఇక కల్కి సినిమా బాహుబలి 2 సినిమా రికార్డు ను బ్రేక్ చేయడమే కాకుండా ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అందుకే నాగ్ అశ్విన్ సినిమా కోసం భారీ టైమ్ తీసుకున్నప్పటికీ చాలా మంచి కలెక్షన్లు రాబట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక నాగ్ అశ్విన్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే ఆయన దగ్గర డిఫరెంట్ కథలు చాలా ఉన్నాయట. అయితే తను రాసుకున్న కథలు ఏ హీరోకి సెట్ అవుతాయి అనేదాన్ని నిదానంగా తెలుసుకుంటూ ఆయన ముందుకు అడుగులు వేయిస్తున్నట్టుగా తెలియజేయడం విశేషం..చూడాలి మరి పాన్ ఇండియా లో ఆయన ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొడుతారా లేదనేది చూడాలి…