Kapil Dev: నాకంటే బుమ్రా వెయ్యి రెట్లు బెటర్… తేల్చేసిన భారత దిగ్గజం!

టీమిండియా కు తొలిసారి వరల్డ్ కప్ అందించిన ఘనత కపిల్ దేవ్ ది. హర్యానా ఎక్స్ ప్రెస్ గా పేరు గడించిన కపిల్ దేవ్.. బౌలింగ్లో చేయని ప్రయోగాలు అంటూ లేవు. అయితే ఇంతటి క్రికెట్ దిగ్గజం కూడా బుమ్రా బౌలింగ్ కు అభిమానిగా మారిపోయాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 28, 2024 8:23 am

Kapil Dev

Follow us on

Kapil Dev: భారత జట్టు ఏస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా కు అభిమానులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.. అయితే వారు సాధారణ ప్రేక్షకులు కాదు.. క్రికెట్ దిగ్గజాలు.. ఇప్పటికే పాకిస్తాన్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్లు వసీం అక్రమ్, ఇయాన్ రాఫెల్ బిషప్, అంబ్రోస్ బుమ్రా బౌలింగ్ కు ఫిదా అయ్యారు. అతడు వేస్తున్న బంతులకు ముగ్ధులయ్యారు..” బౌలింగ్ ఇలా కూడా చేస్తారా.. వికెట్లు ఇలా కూడా తీస్తారా.. నిర్జీవమైన మైదానంపై ఇలాంటి అద్భుతాలు కూడా చేయవచ్చా.. ఇతడు ఈ కాలపు స్వింగ్ మాస్టర్. వయసు కనుక తక్కువ ఉంటే.. అతని వద్ద బౌలింగ్ మెలకువలు నేర్చుకునే వాళ్ళమని” వసీం అక్రమ్, ఇయాన్ రాఫెల్ బిషప్, ఆంబ్రోస్ ఇటీవల వ్యాఖ్యానించారు.. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో క్రికెట్ లెజెండ్ చేరారు.

టీమిండియా కు తొలిసారి వరల్డ్ కప్ అందించిన ఘనత కపిల్ దేవ్ ది. హర్యానా ఎక్స్ ప్రెస్ గా పేరు గడించిన కపిల్ దేవ్.. బౌలింగ్లో చేయని ప్రయోగాలు అంటూ లేవు. అయితే ఇంతటి క్రికెట్ దిగ్గజం కూడా బుమ్రా బౌలింగ్ కు అభిమానిగా మారిపోయాడు.. కపిల్ దేవ్ అద్భుతమైన ఆల్ రౌండర్ అయినప్పటికీ.. తనకంటే బుమ్రా గొప్ప బౌలర్ అని అభివర్ణించాడు. “ప్రస్తుత టి20 క్రికెట్లో బుమ్రాను చూస్తే ముచ్చటేస్తోంది. వైవిధ్యమైన బంతులు వేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లలో వణుకు పుట్టిస్తున్నాడు. ఎలాంటి మైదానం పైనైనా నిప్పులు చెరిగే విధంగా బంతులు వేస్తున్నాడు. అతడిని కాచుకోవడం ప్రత్యర్థి ఆటగాళ్లకు ఇబ్బందిగా మారింది. బుమ్రా నాకంటే వెయ్యిరెట్లు అద్భుతమైన బౌలర్.. ఇప్పటి వర్తమాన క్రికెట్ లో ఎంతమంది నాణ్యమైన బౌలర్లు ఉన్నారు. వారికి అనుభవం ఉందని” కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.. ఓ స్పోర్ట్స్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని.. అందువల్లే టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలు సాధిస్తోందని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.. నాణ్యమైన క్రికెట్ ఆడుతూనే.. ఫిట్ నెస్ కూడా కాపాడుకుంటున్నారని పేర్కొన్నాడు.. మైదానంలో ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారని.. దానిని ఇలాగే కొనసాగిస్తే గొప్ప క్రికెటర్లుగా రూపాంతరం చెందుతారని కపిల్ దేవ్ పేర్కొన్నాడు..కాగా, ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్, పాకిస్తాన్ జట్లతో జరిగిన లీగ్ మ్యాచ్ లలో భారత జట్టుకు బుమ్రా విజయాలు అందించాడు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాలు దక్కించుకున్నాడు.