Mrunal Thakur: సినిమా ఇండస్ట్రీలో హీరో అయినా, హీరోయిన్ అయినా వైవిద్య భరితమైన పాత్రలను పోషిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తమ నటనలో పరిణితి ని చూపిస్తేనే ఇక్కడ స్టార్లుగా వెలుగొందుతారు. అంతే తప్ప ఒకే రకమైన పాత్రలను పోషిస్తూ కూడా ముందుకు సాగడం అనేది అసంభవం. ఎందుకంటే ఒక పాత్రలో ఒక ఆర్టిస్ట్ ను ఒకటి లేదా రెండు సార్లు చూసిన జనాలు ఇక మీదట అలాంటి పాత్రల్లో వాళ్లను చూడటానికి ఇష్టపడరు. ఎందుకంటే అది రొటీన్ అయిపోతుంది కాబట్టి వాళ్ల నుంచి సంథింగ్ స్పెషల్ యాక్టింగ్ ని అభిమానులు కోరుకుంటారు.
అందువల్లే నటినటులు ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలను పోషించకూడదు. ఇక వైవిధ్యమైన పాత్రల్లో తమ నటనని చూపిస్తేనే వాళ్లని ఆరాధించే అభిమానుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా, పరుశురాం డైరెక్షన్ లో వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో ఆమె నటన చాలా అద్భుతంగా ఉంది.
అయిన కూడా ఆమె ఇప్పటివరకు తెలుగులో మూడు సినిమాల్లో నటించింది. ఇక ఈ మూడు సినిమాల్లో కూడా ఆమె పాత్ర ఒకే విధంగా ఉండటం అనేది ఇప్పుడు చాలా చర్చలకు దారి తీస్తుంది. నిజానికి ఆమె చేసిన సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ మూడు సినిమాల్లో కూడా ఆమె ఒక మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టి మిడిల్ క్లాస్ అబ్బాయి కోసం పరితపించే క్యారెక్టర్ లో నటించింది. అయితే ఇదే టైప్ ఆఫ్ పాత్ర మళ్లీ మళ్లీ చేయడం వల్ల ప్రేక్షకులకు ఆమె రొటీన్ యాక్టింగ్ ని చూడలేక బోర్ కొట్టేస్తుంది.
కాబట్టి తెలిసో తెలియకో ఇప్పటివరకు ఈ మూడు సినిమాల్లో ఒకే రకమైన పాత్రలను చేసింది. కానీ ఇకమీదట తను ఎంచుకునే పాత్రలు డిఫరెంట్ గా ఉంటే తప్ప తను ఇండస్ట్రి లో స్టార్ హీరోయిన్ గా ఎదగలేదు…ఇవన్నీ కరెక్ట్ గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తే ఆమె చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది…