https://oktelugu.com/

Roja Love Story: రోజా – సెల్వమణి ఎప్పుడు ఎలా కలిశారు.. వారి ప్రేమ కథ ఏంటి?

సినిమాల్లో మంచి పేరు సంపాదించిన రోజా ఆ తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేసింది. ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూనే ఆ తర్వాత మంత్రిగా అవకాశం దక్కించుకుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 8, 2024 / 04:31 PM IST

    Roja Love Story

    Follow us on

    Roja Love Story: సీనియర్ నటీనటులు ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్నారు. కొందరు వ్యాపారాల వైపు అడుగులు వేస్తే.. మరికొందరు ఇండస్ట్రీలోనే ఉన్నారు. మరికొందరు ఏకంగా రాజకీయాల వైపు వెళ్లి మంచి పేరును సంపాదించారు. అయితే సినిమా రంగంలో ఉంటూనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కొందరు. మరికొందరు పెళ్లి తర్వాత విడిపోయి వేరుగా ఉంటున్నారు. ఇక రోజా సెల్వమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాల్లో ఒకప్పుడు తన సత్తా చాటింది. సీనియర్ హీరోలందరి సరసన నటించింది.

    సినిమాల్లో మంచి పేరు సంపాదించిన రోజా ఆ తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేసింది. ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉంటూనే ఆ తర్వాత మంత్రిగా అవకాశం దక్కించుకుంది. ఇక ఎమ్మెల్యేగా ఉంటున్న సందర్భంలో జబర్దస్త్ షో లో జడ్జిగా వ్యవహరించింది రోజా. ఈమె ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వమణిని లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి వీరి లవ్ స్టోరీ ఎలా మొదలైంది? ఎక్కడ పరిచయం అయ్యారు? ఎలా పెళ్లి చేసుకున్నారు వంటి పూర్తి వివరాలు మీకోసం.. మరి ఆలస్యం ఎందుకు ఓసారి చూసేయండి

    మొదటి సారి రోజా తన భర్త సెల్వమణిని సినిమా ఆఫీసులోనే కలిసిందట. తమిళంలో చామంతి సినిమా తీసే ప్రయత్నం లో ఉన్నారు సెల్వమణి. హీరోయిన్ ల కోసం సెర్చ్ చేస్తున్న సమయంలో రోజా ఫోటో చూశారట ఈ దర్శకుడు. రోజా నచ్చడంతో వెంటనే ఆఫీస్ కు పిలిపించమని చెప్పారట. ఇక రోజా కూడా తన తండ్రితో కలిసి సెల్వమణి ఆఫీస్ కు వెళ్లిందట. ఆ తర్వాత రోజు రమ్మని మేకప్ టెస్ట్, కాస్టూమ్స్ టెస్ట్ చేశారట. చామంతి సినిమా షూటింగ్ లోనే ఒకరికి ఒకరు పరిచయం అయ్యారట.

    ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఎక్కువగా మాట్లాడుకోలేదట ఇద్దరు. కానీ రోజా వెంకటేశ్వర స్వామి ఫోటో గిఫ్ట్ గా ఇవ్వడంతో ఆయనకు రోజా మీద మంచి అభిప్రాయం వచ్చిందట. కానీ రోజా మాత్రం ప్రేమతో ఇచ్చింది అనుకున్నారట. కానీ ఇద్దరు ఒకరికి ఒకరు ప్రపోజ్ కూడా చేసుకోలేదట. ఒకరోజు సెల్వమణి రోజా ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారట. అలా ఇద్దరి పెళ్లి జరిగిపోయింది. అయితే మంచి విషయం ఏంటంటే.. ఇప్పటికీ ఇద్దరు కూడా కలిసిమెలిసి ఆనందంగా ఉన్నారు.