Tollywood: హీరోల కంటే విలన్స్ ఎక్కువ ఇంటెలిజెంట్ గా ఉన్న సినిమాలు ఇవే…ఆ విలన్స్ వీళ్లే…

హీరో అంటే సామాన్య మానవుడి లాగానే నిజజీవితంలో ఎలాగైతే ఒక మనిషి తనకు వచ్చిన ప్రాబ్లంని సాల్వ్ చేసుకొగలడో అలాంటి కారణాలతోనే సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు.

Written By: Gopi, Updated On : April 6, 2024 4:52 pm

Tollywood

Follow us on

Tollywood: ఒకప్పుడు సినిమాల్లో హీరో అంటే తను అనుకున్నది సాధిస్తు, తనవాళ్లను కాపాడుకుంటూ, తను ప్రేమించిన అమ్మాయిని పొందటమే లక్ష్యంగా పెట్టుకుని సినిమాలనేవి సాగేవి. ఇక అలా వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సూపర్ డూపర్ సక్సెస్ లను కూడా అందుకునేవి. ఇక ఒకప్పుడు హీరో అంటే స్క్రీన్ మీద ప్రేక్షకులు చేయలేనిది చేసి చూపించే వాడని భావించే వాళ్ళు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.

హీరో అంటే సామాన్య మానవుడి లాగానే నిజజీవితంలో ఎలాగైతే ఒక మనిషి తనకు వచ్చిన ప్రాబ్లంని సాల్వ్ చేసుకొగలడో అలాంటి కారణాలతోనే సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకుంటున్నారు. కొన్ని సినిమాల్లో మాత్రం హీరోల కంటే విలన్స్ ను చాలా ఇంటలిజెంట్ గా చూపించి ఆ విలన్ని కొట్టడానికి హీరో ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటాడు. అనే ధోరణి లోనే సినిమాలను తెరకెక్కించి వాటిని సూపర్ డూపర్ సక్సెస్ గా మార్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తెలుగులో వచ్చిన కొన్ని సినిమాల్లో హీరోల కంటే విలన్లు చాలా ఇంటలిజెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఆ సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…

రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధృవ సినిమాలో హీరో కంటే విలన్ పాత్ర పోషించిన అరవింద స్వామి చాలా ఇంటలిజెంట్ గా కనిపిస్తాడు. ఆయన చేసే ప్రతి మూమెంట్ కూడా చాలా ఇంటలిజెంట్ గా ఉంటుంది. దాని కారణంగానే హీరోని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ అండ్ టార్చర్ కి గురి చేస్తాడు. ఇక మొత్తానికైతే హీరో ఆ విలన్ ని తన మైండ్ గేమ్ తో కొట్టి సక్సెస్ ఫుల్ గా ఎండ్ చేస్తాడు…

నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన లై సినిమాలో విలన్ గా నటించిన అర్జున్ కూడా హీరో కంటే చాలా ఇంటలిజెంట్ గా ఆలోచిస్తాడు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆయన ఆడే మైండ్ గేమ్ ని తట్టుకోవడం హీరో వల్ల కాదు. అలాంటి ఒక విలన్నీ కొట్టడానికి హీరో ఎలాంటి స్ట్రాటజీని మెయింటైన్ చేశాడు అనే ఒక సస్పెన్స్ తో ఈ సినిమా నడుస్తుంది…