https://oktelugu.com/

Manjummel Boys Review: ‘ముంజుమ్మల్ బాయ్స్’ మూవీ రివ్యూ…

మలయాళం లో వచ్చిన 'ముంజుమ్మల్ బాయ్స్' సినిమాని తెలుగులో డబ్ చేస్తూ ఇవాళ్ళ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడుని అలరించిందా లేదా.?

Written By:
  • Gopi
  • , Updated On : April 25, 2024 6:01 pm
    Manjummel Boys telugu movie review

    Manjummel Boys telugu movie review

    Follow us on

    Manjummel Boys Review:  ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలతో దర్శకులు సినిమాలు చేస్తూ ప్రేక్షకుడిలో అటెన్షన్ ను క్రియేట్ చేస్తూ చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. ఇక మలయాళం సినిమా ఇండస్ట్రీలో అయితే ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకుల ఊహకు అందని కథలతో వచ్చి మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మలయాళం లో వచ్చిన ‘ముంజుమ్మల్ బాయ్స్’ సినిమాని తెలుగులో డబ్ చేస్తూ ఇవాళ్ళ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడుని అలరించిందా లేదా.? మలయాళం లో హిట్ అయినట్టుగానే ఇక్కడ కూడా ఒక భారీ సక్సెస్ ని సాధించిందా.? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ
    ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో కేరళ కి చెందిన కొంతమంది కొడైకెనాల్ కి వెళ్లడానికి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. ఇక అందులో భాగంగానే వాళ్లు ఆ ట్రిప్ ని చాలా ఎంజాయ్ చేస్తూ ముందుకు కదులుతూ ఉంటారు. ఇక ఇటువంటి క్రమంలోనే ‘డెవిల్స్ కిచెన్’ గా పిలవబడే ‘గుణ కేవ్స్’ దగ్గర వాళ్లు ఆగడం అక్కడ జరిగే కొన్ని పరిణామాలతో వాళ్లు అనుకోని చిక్కుల్లో పడడంతో సినిమా అనేది ప్రేక్షకుడిని ఒక ఉత్కంఠ కైతే గురిచేస్తుంది. ఇక గుణ కేవ్స్ దగ్గర ఏం జరిగింది. వాళ్ళు సక్సెస్ ఫుల్ గా వాళ్ళ ట్రిప్ ని కంటిన్యూ చేశారా లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దీన్ని కథగా చూసుకుంటే ఇది పెద్ద కథ అయితే కాదు. ఇక సినిమాగా చేసే అంత కథ అయితే కాదు అనిపిస్తుంది. కానీ దర్శకుడు చిదంబరం రాసుకున్న సీన్స్ గాని, స్క్రీన్ ప్లే గాని, ప్లే చేసిన డ్రామా గాని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి. ఇక సినిమా స్టార్ట్ అయిన 30 మినిట్స్ మినహాయిస్తే ఈ సినిమా ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సాగుతుంది. 30 నిమిషాలు మాత్రం క్యారెక్టర్ లని ఎస్టాబ్లిష్ చేయడానికే దర్శకుడు టైం తీసుకున్నాడు. కాబట్టి అదంతా మనకి కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాని ఫ్రెండ్షిప్ మీద బేస్ చేసుకొని దర్శకుడు సీన్స్ ని నడిపించాడు. అలాగే మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు ప్రతిదీ ఫ్రెండ్షిప్ మీద బేస్ అయి ఉండే విధంగా సీన్స్ ని రాసుకోవడమే కాకుండా టైట్ స్క్రీన్ ప్లే ను రాసుకుంటూ వచ్చాడు. అయితే ఒక వ్యక్తి లోయ లో పడిపోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటి అతన్ని సేవ్ చేయడానికి వీళ్లంతా ఎలాంటి ప్లాన్స్ వేశారు.

    ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు. ఆ లోయ నుంచి ఆయన ఎలా బయటపడ్డాడు అనే ఒక ఉత్కంఠ ని కలిగిస్తూ, క్యారెక్టర్లతోనే ప్రేక్షకుడి లో ఒక డిఫరెంట్ మూడ్ ను క్రియేట్ చేస్తూ సినిమాని ముందుకు నడిపించాడు. ఇక దర్శకుడి ప్రతిభను చూపించే విధంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి..కొన్ని సీన్స్ లో అయితే మ్యూజిక్ వల్లే ఆ సీన్ ఎమోషన్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చింది. ఇక దర్శకుడి మైండ్ లో ఉన్న సీన్లకి దృశ్య రూపాన్ని ఇచ్చిన విజువల్స్ కూడా చాలా బాగున్నాయి… ఒక చిన్న పాయింట్ తో దర్శకుడు రెండు గంటల పాటు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసిన విధానం అయితే ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్క ఆడియన్ కళ్ళలో నుంచి నీళ్లు తిరగడం మనం గమనించవచ్చు…

    ఇక ముఖ్యంగా శ్రీనాథ్, శోభన్ అనే ఆర్టిస్టుల యొక్క పర్ఫామెన్స్ అయితే ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. దర్శకుడు వాళ్ళ క్యారెక్టర్ ని ఎలాగైతే డిజైన్ చేశాడో వాళ్లు కూడా ఆ క్యారెక్టర్ కోసం 100% ఎఫెర్ట్ ను పెట్టి నటించి సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపారనే చెప్పాలి…ఇక ఇది ఇలా ఉంటే కొన్ని చోట్ల మాత్రం ఈ సినిమా సగటు ప్రేక్షకుడికి ఒకసారి కనెక్ట్ అయితే పర్లేదు, కానీ కనెక్ట్ అవ్వకపోతే మాత్రం ఈ సినిమా చూస్తున్న ప్రతి అభిమానికి ఇదొక టార్చర్ లాగే అనిపిస్తుంది. ఇక కొన్ని సీన్లు స్లోగా నడవడం కూడా ఈ సినిమా మీద కొంతవరకు ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ వాళ్ల క్యారెక్టర్ కి న్యాయమైతే చేశారు. శోభన్ శాహిర్, శ్రీనాథ్ భశి కనబరిచిన నటన వాళ్లు చూపించే హావభావాలు ప్రేక్షకుడి కళ్ళల్లో నీళ్లు తెప్పించేలా ఉన్నాయి. అలాగే ప్రతి సీన్ లో వీళ్ళకంటూ ఒక ఓన్ స్టైల్ ని క్రియేట్ చేసుకొని నటించిన నటనకి ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతూ ఉంటాడు. అందువల్లే ఈ సినిమా ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయిందనే చెప్పాలి. ఇక శోభన్ శాహిర్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా కావడం సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే నటుడిగా తన పర్ఫామెన్స్ ని చూపిస్తూనే అటు ప్రొడ్యూసర్ గా కూడా ఈ సినిమా మీద మనీ ని ఇన్వెస్ట్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక తను ఒకే సినిమా ద్వారా హీరోగా, ప్రొడ్యూసర్ గా రెండు రకాలుగా సక్సెస్ ఫుల్ గా తన బాధ్యతను నిర్వర్తించాడనే చెప్పాలి… ఇక మొత్తానికైతే మిగిలిన ఆర్టిస్టులందరూ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన సుశిన్ శ్యామ్ ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టినట్టుగా కనిపించింది. ప్రతి సీన్ తాలూకు ఇంటెన్స్ ని చెడగొట్టకుండా దానికి బిజిఎం ఇవ్వడం అనేది నార్మల్ విషయం కాదు. అలాంటి సిచువేషన్ లో కూడా ఈయన ఈజీగా ఆ సీన్ తాలూకు ఎమోషన్ ను అడాప్ట్ చేసుకొని మంచి బిజిఎం ని అందించాడు. అందువల్లే ప్రతి సీను కూడా ఫ్రెష్ గా ఉంటూనే ఒక తెలియని హై ఫీల్ ని ఇస్తుంది. ఈ సినిమాలో ఒక పర్టిక్యూలర్ టైం లో కమలహాసన్ ఒక సూపర్ హిట్ సాంగ్ ను కూడా వాడుకోవడం జరిగింది. అది కూడా సినిమాకి చాలా ప్లస్ పాయింట్ గా మారింది… ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా శ్యజు ఖలీద్ తన పూర్తి బాధ్యతను నిర్వర్తించాడు. ప్రతి సీను కూడా విజువల్ గా సూపర్ గా ఉండడమే కాకుండా ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించింది. ఇక అతను లోయలో పడిపోయిన తర్వాత వచ్చిన కొన్ని సీన్లు, ఈ సినిమాకి ఆయన అందించిన విజువల్స్ లోనే ది బెస్ట్ విజువల్స్ అనే చెప్పాలి. ఇక దర్శకుడు అతనికి ఇచ్చిన ఇన్ పుట్స్ ను వాడుకుంటూనే అతను ఇచ్చిన ఔట్ పుట్ చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా సక్సెస్ అనేది ఒక టీం వర్క్ గా చెప్పుకోవచ్చు…

    ప్లస్ పాయింట్స్

    కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్
    మ్యూజిక్
    శోభన్, శ్రీనాథ్ లా యాక్టింగ్
    విజువల్స్…

    మైనస్ పాయింట్స్

    స్లో నరేషన్
    కొన్ని సీన్స్ బోరింగ్ గా నడిచాయి…

    రేటింగ్
    ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5

    చివరి లైన్

    ఒక సస్పెన్స్ తో కూడిన ఇంటెన్స్ డ్రామా ను ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను చూడవచ్చు…