Movie celebrities: ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా సినీ సెలబ్రెటీస్ కు ఎక్కువగా ఆదరణ ఉంటుంది. సినిమా తెరపై ఎక్కువగా కనిపించేవారు ఒక్కసారిగా జనాల్లోకి రియల్ గా కనిపించేసరికి వారిని చూసేందుకు ఇక పడుతూ ఉంటారు. వారు ఏదైనా ఫంక్షన్ కు వచ్చినా.. ఏదైనా కార్యక్రమానికి వచ్చినా.. వెంటనే తమకు వేరే పని ఉందని చెప్పి వెళ్ళిపోతుంటారు. వారు ఎక్కువసేపు జనాల్లో ఉండలేకపోతుంటారు. అలాగే ఏదైనా వివాహానికి వచ్చినా కూడా ఇలా ఫోటో దిగి కనీసం భోజనం చేయకుండా కూడా వెళ్ళిపోతారు. అసలు ఎక్కువగా ఇలాంటి సినీ సెలబ్రిటీ స్ జనం మధ్యలో ఉండకపోవడానికి కారణమేమిటి? వారికి నిజంగానే బిజీ షెడ్యూల్ ఉంటుందా? బిజీ షెడ్యూల్ లేని వారు కూడా ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంటారు?
చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది. ముందుగా సినీ సెలబ్రిటీస్ ఎక్కువగా జనంలో ఉండకపోవడానికి ప్రధాన కారణం.. వారు తమ ఇమేజ్ ను కాపాడుకోవడానికే.. ఎక్కువగా జనాలకు కనిపించిన కూడా.. లేదా రియల్ గా వారి మొహాలు కనిపించినా.. వారి విలువ తగ్గిపోతుందని భావిస్తారు. బయట ఎక్కువగా కనిపించి.. సినిమాల్లో కనిపించేసరికి వారిని చూడడానికి ఎక్కువగా ఇష్టపడరు. దీంతో వారికి అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల చాలామంది సెలబ్రిటీస్ తమకు బిజీ షెడ్యూల్ లేకపోయినా ఎక్కువగా ప్రజల మధ్య ఉండడానికి ఇష్టపడరు.
కొంతమంది సినీ సెలబ్రిటీస్ యాడ్స్లో నటించడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎక్కువగా యాడ్స్ లేదా ఇతర కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం వల్ల వారి రియల్ ఫేస్ కనిపించే అవకాశం ఉంటుంది. ఇలా రియల్ గా చూసినవారు సినిమా తెరపై చూడడానికి ఇష్టపడరు. అంతేకాకుండా ఎప్పుడు యాడ్స్ లేదా ఇతర కార్యక్రమాల ద్వారా వారు కనిపించిన తర్వాత సినిమాల్లో చూస్తే అట్రాక్షన్ అనిపించదు. ఇలాంటి సమస్యలు వస్తాయని కొంతమంది యాడ్స్ లో నటించడానికి ఇష్టపడరు. అయితే ఇటీవల కాలంలో మాత్రం అవేమీ పట్టించుకోకుండా చాలామంది స్టార్స్ యాడ్స్ లో నటించడానికి ముందుకు వస్తున్నారు. కొంతమంది డైరెక్టర్లు కూడా యాడ్స్ లో నటించి ఆకట్టుకుంటున్నారు.
ఇక మరి కొంతమందికి మాత్రం వరుస సినిమాలో ఉండడంతో బిజీ షెడ్యూల్ ఉంటుంది. అయితే వారిని ఆహ్వానించిన వారి గౌరవం, మర్యాదలు కాపాడుకోవడానికి పార్టీ కార్యక్రమాలు, శుభకార్యాలకు హాజరవుతూ వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ సమయం ఒకే చోట ఉండడం వల్ల మిగతా ప్రాంతాలకు వెళ్లడం కష్టమవుతుంది. మరో విషయం ఏమిటంటే ఇలాంటి సెలబ్రిటీస్ జనాల్లోకి రావడం వల్ల వీరిని చూసేందుకు చాలా మంది వస్తుంటారు. ఇలాంటి సమయంలో సెక్యూరిటీ సమస్యలు ఉంటాయి. అందువల్ల వీరు ఎక్కువసేపు ఉండటం వల్ల జనాలు ఎగబడే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ముందే వీరికి సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ చేస్తూ ఉంటారు. దీంతో వారు ఎక్కువగా ఒకే చోట ఉండకుండా వెంటనే వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారు.