NTR Prashanth Neel Movie Dragon : ‘దేవర’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) నుండి ఈ ఏడాది విడుదలైన ‘వార్ 2’ అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసింది. ఎన్టీఆర్ సినిమా అంటే ఎంత పెద్ద ఫ్లాప్ అయినా మినిమం గ్యారంటీ కలెక్షన్స్ వస్తాయి. కానీ ‘వార్ 2’ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్ అని చెప్పొచ్చు. దేవర కి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి 54 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, ‘వార్ 2’ చిత్రానికి క్లోజింగ్ లో కూడా అంత షేర్ వసూళ్లు రాలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ డిజాస్టర్ ఫ్లాప్ అనేది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఫ్లాప్ ని పెద్దగా మనసుకి ఎక్కించుకోలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ తదుపరి చిత్రం ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో కాబట్టి. ‘సలార్’ తర్వాత వస్తున్న సినిమా కావడం తో ఫ్యాన్స్ లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా మొదలై కొంతభాగం షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. కానీ మధ్యలో ప్రశాంత్ నీల్ సినిమాలోని రషస్ చూసిన తర్వాత నిరుత్సాహానికి గురయ్యాడని. ఆ కారణం చేత షూటింగ్ మొత్తాన్ని ఆపేసి మళ్లీ కొత్తగా స్క్రిప్ట్ ని రాసుకొచ్చి తెరకెక్కిస్తారని కొందరు, షూటింగ్ మొత్తం ఆగిపోయింది, అసలు వీళ్ళ కాంబినేషన్ లో సినిమానే ఉండదని మరికొందరు కామెంట్స్ చేశారు. ఈ ప్రచారం సోషల్ మీడియా లోనే కాకుండా, ఎలక్ట్రానిక్ మీడియా లో కూడా విస్తృతంగా ప్రచారమైంది. కానీ రీసెంట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరు నుండి తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో షాకింగ్ న్యూస్ ఏమిటంటే ఈ సినిమాని ఒక భాగం గా కాదు, రెండు భాగాలుగా తెరకెక్కించాలని అనుకుంటున్నారట. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత 3 గంటల 45 నిమిషాలు వస్తుందట.
దీంతో ప్రశాంత్ నీల్ దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నాడట. ఎన్టీఆర్ తో కూడా విషయం పై చర్చలు జరపగా, ఆయన వైపు నుండి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ రెండు సినిమాలు ఇంతకు ముందు సీక్వెల్స్ లాగా భారీ గ్యాప్ తో విడుదల అవ్వవట. కేవలం నెలల గ్యాప్ లోనే రిలీజ్ అవుతాయట. ఇది ఫ్యాన్స్ కి నిజంగా డబుల్ ట్రీట్ అనే చెప్పాలి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన రోజు సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుందనే చెప్పాలి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.