మోహన్ బాబు పై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇంకా వైరల్ అవుతుండగానే… తాజాగా మంచు విష్ణు కాస్త తెలివిగా టాపిక్ ను డైవర్ట్ చేశాడు. త్వరలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి తనకే ఓటు వేస్తారని మంచు విష్ణు కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు మాట్లాడుతూ ‘ఎన్నికల విషయం పై ఇప్పటివరకూ నేను మెగాస్టార్ చిరంజీవి గారిని కలవలేదు. అయితే, నామినేషన్ వేసిన తర్వాత మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత… నేను చిరంజీవి గారిని తప్పకుండా కలుస్తాను.

నా విజన్ విన్నాక, తప్పకుండా చిరంజీవి గారు నాకే ఓటు వేస్తారని నేను నమ్ముతున్నాను. ఇక ఇప్పటివరకూ మా నాన్న 800 మంది ఆర్టిస్ట్ లకు ఫోన్ చేసి… మీ సహకారం కావాలి అని కోరగా వాళ్లందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు’ అని విష్ణు చెప్పుకుకొచ్చారు. ఇక విష్ణు ‘మా’ సంస్థ గురించి మాట్లాడుతూ… ‘మా’కు శాశ్వత భవనం మాత్రమే కాదు, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి.
ఇక నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే ‘మా’ భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని నేనే భరిస్తా అని చెప్పాను. అలాగే భరిస్తాను. ఒక నిర్మాతగా నేను దెబ్బతిన్నప్పటికీ… అప్పు తీసుకువచ్చి దాన్ని నిర్మిస్తాను. అలాగే సినిమా పరిశ్రమకు ఇంకా కొత్త నటీనటులు వచ్చేలా తగిన అవకాశలను కల్పిస్తాను. అలాగే సినీయర్ నటీనటులకు అన్నిరకాలుగా అండగా ఉంటాను.
నాకు ప్రతి విషయం పై చాలా స్పష్టత ఉంది. కచ్చితంగా ప్రకాశ్ రాజ్ కంటే నేను బాగా అభివృద్ధి కార్యక్రమాలు చేయగలను. అందుకే నేను పోటీలోకి దిగాను’ అంటూ విష్ణు చాలా తెలివైన కామెంట్స్ చేశాడు. మొత్తానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనే కసితో ఉన్నాడు మంచు విష్ణు. అందుకోసం అన్ని రకాలుగా ముందుకు వెళ్తున్నాడు. అందుకే (మా) ఎన్నికలు మొదలవ్వక ముందే రసవత్తరమైన పోటీ మొదలైంది.