https://oktelugu.com/

Surya: హీరో సూర్య ప్లానింగ్ మామూలుగా లేదుగా.. సాధ్యమవుతుందా.?

శివ డైరెక్షన్ లో చేస్తున్న కంగువ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. ఇక ఈ సినిమాతో పాటుగా ప్రస్తుతం ఆయన కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో కూడా ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో ఒక సినిమాను చేయబోతున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 17, 2024 / 09:56 AM IST

    Surya

    Follow us on

    Surya: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్య భరితమైన సినిమాలను చేసే హీరోల్లో సూర్య ఒకరు… ప్రస్తుతం సూర్య పాన్ ఇండియాలో సక్సెస్ సాధించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆయనకి ఇప్పటివరకు తెలుగు తమిళ లాంగ్వేజ్ లో మాత్రమే సక్సెస్ లు ఉన్నాయి. ఇక పాన్ ఇండియా లో ఆయనకి ఒక్క సక్సెస్ కూడా లేదు. కాబట్టి తను ఇప్పుడు ఎలాగైనా సరే పాన్ ఇండియా లో పాగా వేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

    మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న ప్రతి సినిమా మీద కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే శివ డైరెక్షన్ లో చేస్తున్న కంగువ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. ఇక ఈ సినిమాతో పాటుగా ప్రస్తుతం ఆయన కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో కూడా ఒక కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి దీంతో కూడా సూపర్ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

    ఇక భారీ గ్రాఫికల్ సినిమాగా తెరకెక్కుతున్న కంగువ సినిమా ఎలాగో సూపర్ సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెంట్ తో సూర్య అయితే ఉన్నాడు. ఇక దాంతో పాటుగా దీన్ని కూడా సక్సెస్ చేస్తే వరుసగా పాన్ ఇండియా లో రెండు సక్సెస్ లు సాధించిన హీరోగా తను మంచి గుర్తింపు పొందుతాడు. తద్వారా బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ అన్ని వుడ్లలో కూడా తన పేరు మారుమ్రోగుతుందనే ఉద్దేశ్యం తోనే ఆయన సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు లాంటి యంగ్ డైరెక్టర్ చాలా రోజుల నుంచి సూర్యతో సినిమా చేయాలని ఒక కథను రాసుకొని పెట్టుకున్నాడట.

    కానీ సూర్యకి ఉన్న బిజీ వల్ల తను ఆ సినిమా చేయలేకపోయాడని చెప్పాడు. కానీ మొత్తానికైతే ఇప్పుడు ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని ఇక ఈ సినిమాను సూపర్ సక్సెస్ చేయడమే తన లక్ష్యం గా కార్తీక్ సుబ్బరాజు పెట్టుకున్నట్టుగా ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం విశేషం…