https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ బాబు బర్త్ డే ట్రీట్… రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఆ కల్ట్ క్లాసిక్, ఫ్యాన్స్ గెట్ రెడీ!

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడు మహేష్ బాబు స్టార్డం సంపాదించాడు. టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఆయన ప్లాప్ చిత్రాలు కూడా వందల కోట్ల వసూళ్లు రాబడతాయి. మహేష్ బాబు రేంజ్ అది. ఫలితంతో సంబంధం లేకుండా మహేష్ బాబును సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడతారు. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన మహేష్... 1999లో హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 16, 2024 / 12:56 PM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu: మరో మూడు వారాల్లో మహేష్ బాబు బర్త్ డే. నెల రోజుల ముందే అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. వేడుకల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో మహేష్ బాబు అభిమానులకు కూడా ట్రీట్ సిద్ధం అవుతుంది. మహేష్ కెరీర్లో కల్ట్ క్లాసిక్ గా ఉన్న ఓ సూపర్ హిట్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు.

    సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడు మహేష్ బాబు స్టార్డం సంపాదించాడు. టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఆయన ప్లాప్ చిత్రాలు కూడా వందల కోట్ల వసూళ్లు రాబడతాయి. మహేష్ బాబు రేంజ్ అది. ఫలితంతో సంబంధం లేకుండా మహేష్ బాబును సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ఆడియన్స్ ఇష్టపడతారు. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన మహేష్… 1999లో హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు.

    దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన మహేష్ బాబు డెబ్యూ మూవీ రాజకుమారుడు సూపర్ హిట్. అరంగేట్రంతోనే మహేష్ బాబు అద్భుతం చేశాడు. ఫ్యూచర్ సూపర్ స్టార్ అనే సంకేతాలు పంపాడు. తిరుగులేని హీరోగా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆగస్టు 9న మహేష్ బాబు జన్మదినం. మహేష్ బాబు 49వ ఏట అడుగుపెట్టనున్నారు. స్టార్ హీరోల బర్త్ డేలకు వారి ఓల్డ్ క్లాసిక్స్, సూపర్ హిట్ చిత్రాలు మరలా విడుదల చేయడం పరిపాటిగా మారింది.

    తమ హీరో బెస్ట్ మూవీని మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు గత పుట్టిన రోజుల్లో ఒక్కడు, అతడు, పోకిరి వంటి చిత్రాలు విడుదల చేశారు. ఈసారి మహేష్ బాబు కెరీర్ బిగినింగ్ లో చేసిన మురారి చిత్రం ఎంచుకున్నారని సమాచారం. మురారి మహేష్ బాబుకు హీరోగా నాలుగో చిత్రం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించాడు.

    2001లో విడుదలైన మురారి మహేష్ బాబు కెరీర్లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. పర్లేదు అనే టాక్ తో మొదలైన ఈ చిత్రం రోజు రోజుకు పుంజుకుంది. భారీ విజయం నమోదు చేసింది. సినిమాకు మణిశర్మ సాంగ్స్ హైలెట్. సోనాలి బింద్రే-మహేష్ బాబు జంట చాలా ఫ్రెష్ గా అనిపిస్తారు. వారి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. కామెడీ, ఎమోషన్, యాక్షన్. లవ్ కలగలిపి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కృష్ణవంశీ తెరకెక్కించాడు.

    మురారి విడుదలై దాదాపు 23 ఏళ్ళు అవుతుంది. ఈ చిత్రాన్ని ఏకంగా 300 థియేటర్స్ లో రీరీలీజ్ చేస్తున్నారని సమాచారం. అలాగే మరికొన్ని సర్ప్రైజ్ లో ఫ్యాన్స్ కోసం సిద్ధంగా ఉన్నాయట. ఎస్ఎస్ఎంబి 29పై కీలక ప్రకటనలు ఉండే సూచనలు కలవు అంటున్నారు. రాజమౌళి-మహేష్ మూవీ లాంఛనమే అయినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. రాజమౌళి మీడియా ముందుకు రాలేదు.

    ప్రతి సినిమా లాంచింగ్ కి ముందు రాజమౌళి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. తాను తీయబోయే సినిమా ఎలా ఉంటుందో ఒక హింట్ ఇస్తాడు. పలు విషయాలు పంచుకుంటారు. ఎస్ఎస్ఎంబీ 29 మూవీ ప్రెస్ మీట్ ఎప్పుడని అటు చిత్ర వర్గాలు ఇటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ప్రకటన ఉండే ఛాన్స్ కలదట. మహేష్ బాబు ప్రీ లుక్ లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయవచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

    ఎస్ఎస్ఎంబి 29 జంగిల్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ చిత్ర బడ్జెట్ దాదాపు రూ. 800 కోట్లు అని సమాచారం. రాజమౌళి కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ మూవీ రూపొందిస్తున్నారు.