https://oktelugu.com/

నాగచైతన్య బర్త్ డే ట్రీట్.. ఏంటో తెలుసా?

సినీ బ్యాక్ గ్రౌండ్ పుష్కలంగా ఉన్న యంగ్ హీరోల్లో నాగచైతన్య ఒకడు. అక్కినేని మూడోతరం వారసుడిగా నాగచైతన్య టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నాగచైతన్య తాత నాగేశ్వర్ రావు.. తన తండ్రి నాగార్జున కూడా టాలీవుడ్లో హీరోలుగా రాణించారు. ప్రస్తుతం నాగచైతన్య కూడా హీరోగా రాణిస్తూ అక్కినేని అభిమానులను అలరిస్తున్నాడు. Also Read: డిసెంబరులో సెట్స్ పైకి బంగార్రాజు? నాగచైతన్య టాలీవుడ్లోకి ‘జోష్’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ మాత్రం అతడికి అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేకపోయినా నటుడిగా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 23, 2020 / 04:02 PM IST
    Follow us on

    సినీ బ్యాక్ గ్రౌండ్ పుష్కలంగా ఉన్న యంగ్ హీరోల్లో నాగచైతన్య ఒకడు. అక్కినేని మూడోతరం వారసుడిగా నాగచైతన్య టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నాగచైతన్య తాత నాగేశ్వర్ రావు.. తన తండ్రి నాగార్జున కూడా టాలీవుడ్లో హీరోలుగా రాణించారు. ప్రస్తుతం నాగచైతన్య కూడా హీరోగా రాణిస్తూ అక్కినేని అభిమానులను అలరిస్తున్నాడు.

    Also Read: డిసెంబరులో సెట్స్ పైకి బంగార్రాజు?

    నాగచైతన్య టాలీవుడ్లోకి ‘జోష్’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ మాత్రం అతడికి అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేకపోయినా నటుడిగా మాత్రం గుర్తింపు తీసుకొచ్చింది. తొలి సినిమాతోనే నాగచైతన్య ఉత్తమ నటుడిగా ఫిలీంఫేర్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ సినిమా తర్వాత ‘ఏం మాయ చేశావో’… ‘100పర్సంట్ లవ్’ సినిమాల్లో నటించి సూపర్ హిట్ విజయాలు అందుకున్నాడు.

    Also Read: బిగ్ బాస్-4: అవినాష్ ఇల్లీగల్ ఎఫైర్స్.. బయటపడిందిలా?

    ఇటీవలే విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘వెంకీమామ’లో నటించి సూపర్ హిట్ విజయం అందుకున్నాడు. రియల్ లైఫ్ లో మామ అల్లుళ్లు అయినా వెంకటేష్-నాగచైతన్య తెరపై కూడా ఆద్యంతం ఆకట్టుకున్నారు. ప్రస్తుతం నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీలో నాగచైతన్యకు జోడీగా సాయిపల్లవి నటిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    నేడు నాగచైతన్య జన్మదినం సందర్భంగా ‘లవ్ స్టోరీ’ చిత్రయూనిట్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. నాగచైతన్య లుక్కుతో కూడిన పోస్టర్ ను విడుదల చేసింది. బనీను.. లుంగీ వేసుకుని పక్కింటి అబ్బాయి గెటప్‌లో నాగచైతన్య ఆకట్టుకున్నాడు. శేఖర్ కమ్ముల సైల్లో ఉన్న పోస్టర్ హీరోయిన్ సాయిపల్లవి తన ట్వీటర్లో పోస్టు చేసి నాగచైతన్య బర్త్ డే విషెస్ చెప్పింది. ఆమెతోపాటు పలువురు సినీ సెలబెట్రీలు నాగచైతన్య పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.