బిగ్ బాస్-4: అవినాష్ ఇల్లీగల్ ఎఫైర్స్.. బయటపడిందిలా?

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ నాలుగో సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ షో 12వ వారానికి చేరింది. ఇక బిగ్ బాస్-4 సీజన్ ముగింపు దశకు చేరుకుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. దీంతో ప్రేక్షకులు బిగ్ బాస్ ను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. Also Read: ఈసారి కూడా ‘బిగ్ బాస్’ వారికి హ్యండిచ్చినట్టేనా? బిగ్ బాస్-4లో ప్రస్తుతం దెత్తడి హరిక.. మొనాల్ […]

Written By: NARESH, Updated On : November 23, 2020 7:05 pm
Follow us on

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ నాలుగో సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ షో 12వ వారానికి చేరింది. ఇక బిగ్ బాస్-4 సీజన్ ముగింపు దశకు చేరుకుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. దీంతో ప్రేక్షకులు బిగ్ బాస్ ను చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు.

Also Read: ఈసారి కూడా ‘బిగ్ బాస్’ వారికి హ్యండిచ్చినట్టేనా?

బిగ్ బాస్-4లో ప్రస్తుతం దెత్తడి హరిక.. మొనాల్ గజ్జర్.. అరియానా.. అభిజిత్.. అఖిల్.. అరియానా.. అవినాష్ మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ ఏడుగురిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరా? అనేది ఆసక్తి మొదలైంది. ఇందులో అభిజిత్.. అఖిల్ మధ్య టైటిల్ పోరు నడువనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే జబర్దస్త్ కామెడియన్ ముక్కు అనివాష్ ఇల్లీగల్ ఎఫెర్స్ పై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒకరు కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.

ముక్కు అవినాస్ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై కామెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్-4 సీజన్లో పాల్గొనేందుకు అవినాష్ జబర్దస్ షోను వదులుకున్నాడు. వైల్డ్ కార్డు ఎంట్రీతో అవినాష్ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. తోటి కంటెస్టంట్లతో కలివిడిగా ఉంటూ తన మార్క్ ఎంటట్మెంట్ అందిస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

Also Read: గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు.. ఈసారి గెస్ట్ ఎవరంటే?

తాజాగా అవినాష్ ఇల్లీగల్ ఎఫెర్స్ పై సొహైల్ షాకింగ్ కామెంట్ చేశాడు. బిగ్ బాస్ తాజాగా విడుదల చేసిన ప్రొమోలో ఈ వ్యాఖ్యలు కన్పించాయి. ఈ ప్రోమోలో అఖిల్.. అరియానా.. సోహైల్ లు అవినాష్‌ను ఆటపట్టించారు. తొలుత అరియానా మాట్లాడుతూ ‘అవినాష్ నువ్వు షర్ట్స్ వేసుకోకు.. వాటి వల్ల పొట్ట కనిపించి అంకుల్‌లా ఉంటున్నావ్.. నీ కంటే ముందు నీ పొట్టే నడుస్తున్నట్లుంది’ అని ఏడిపించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

ఆ వెంటనే సొహైల్ స్పందిస్తూ ‘అవును.. అవినాష్‌కు పొట్ట ఉంది.. ఐతే ఏంటి? ఆయనకు ఇల్లీగల్ ఎఫైర్లు కూడా ఉన్నాయి.. అంతేకాదు.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మణికొండ.. కూకట్‌పల్లిలో అకౌంట్లు ఉన్నాయి.. అయితే ఏంటిప్పుడు అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో అవినాష్ తలపట్టుకొని ‘ఏరా అయ్యా నేనేం పాపం చేశానురా’ అంటూ బిక్కముఖం వేయడం ఆకట్టుకుంది.