KTR- Adipurush: ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలలో ఒక్కటి ఆది పురుష్..ప్రముఖ బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా టాకీ పార్టీ మొత్తం పూర్తి చేసుకుంది..ఇండియా లో మొట్టమొదటి మోషన్ కాప్చర్ టెక్నాలజీ తో తెరకెక్కతున్న ఈ సినిమా కోసం మన టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు..బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఈ సినిమాలో రాముడు మరియు సీత పాత్రలలో ప్రభాస్ మరియు క్రితి సనన్ నటిస్తుండగా, రావణాసురుడి పాత్ర లో బాలీవుడ్ టాప్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు..అజయ్ దేవగన్ హీరోగా ఓం రౌత్ గత చిత్రం తానాజీ బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్క ప్రభంజనం సృష్టించింది..అలాంటి సినిమా తర్వాత వస్తున్నా మూవీ కావడం తో ఈ మూవీ పై బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..ఇది ఇలా ఉండగా ఈ చిత్రం పై తెలంగాణ IT శాఖా మంత్రి KTR చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఇక అసలు విషయానికి వస్తే ఉత్తర భారత దేశం లో శ్రీ రామునికి ఎలాంటి భక్తులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..శ్రీ రాముడు అన్నా, దేశ భక్తి అన్నా ఇక్కడి జనాలకు ప్రాణం తో సమానం..సినిమాలు కూడా ఇటీవల కాలం లో ఈ రెండు సెంటిమెంట్స్ తోనే తీస్తూ అక్కడి జనాలను బాగా ఆకట్టుకుంటున్నారు మేకర్స్..ఇటీవల విడుదల అయినా రాజమౌళి #RRR సినిమాలో కూడా రామ్ చరణ్ అల్లూరి గెటప్ ని శ్రీరాముని తో పోలుస్తూ ఉత్తరాది ప్రేక్షకులు థియేటర్స్ లో జై శ్రీ రామ్ అంటూ నినాదాలు చేసే వీడియోలను మనం యూట్యూబ్ లో ఎన్నో చూసాము..ఇప్పుడు ప్రబస్ ఏకంగా శ్రీ రాముడి పాత్ర చేస్తుండడం తో ఇక ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా ఆదరించబోతున్నారో మనం ఊహించుకోవచ్చు..ఇది ఇలా ఉండగా ఉత్తరాది లో ఇటీవల తెరకెక్కుతున్న సినిమాలు అన్నిటికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రమేయం ఉంది అని తెలంగాణ IT శాఖ మంత్రి KTR గారు షాకింగ్ కామెంట్స్ చేసారు.
Also Read: OKTelugu MovieTime: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్ !

బీజేపీ పార్టీ ప్రొమోషన్స్ లో భాగంగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఆది పురుష్ మరియు కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు తియ్యుస్తున్నాడు అని..ప్రధాన మంత్రి ఆఫీస్ నుండి వస్తున్నా సూచనల మేరకే బాలీవుడ్ దర్శకులు అలాంటి కథలను తయారు చేస్తున్నారు అని..KTR గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..జనాల సెంటిమెంట్ తో ఆదుకోవడం బీజేపీ పార్టీ కి వెన్నతో పెట్టిన విద్య అని, చివరికి వినోదం ని పంచే సినిమా వంటి మాధ్యమాలను కూడా వదిలిపెట్టడం లేదు అని ఆయన దుయ్యబట్టారు..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియదు కానీ , ప్రభాస్ అభిమానులు మాత్రం తమ హీరో సినిమా పై ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు KTR పై సోషల్ మీడియా లో మండిపడుతున్నారు.
Also Read: Tamannaah: తమన్నా పై మళ్లీ పుకార్లు.. నిజానిజాల మాటేమిటి ?
Recommended Videos:





[…] […]
[…] […]
[…] TRS Plenary : అంతన్నారు.. ఇంతన్నారు.. చివరకు చప్పగా ముగించారు. ఇదీ టీఆర్‌ఎస్ పార్టీ 21న రోజు వేడుకలపై సొంత పార్టీ నేతలే చేస్తున్న కామెంట్.. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ పండుగ చప్పగా ముగిసింది. ఆర్భాటాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పార్టీ.. ఈ వేడకలో సీఎం, గులాబీ బాస్ కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ప్రసంగంపై అందరూ దృష్టిసారించారు. కానీ కేసీఆర్, కేటీఆర్ ప్రసంగం చప్పగా సాగాయి. గులాబీ శ్రేణులకు నిరాశను మిగిల్చాయి. కేసీఆర్ కంటే ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ ప్రసంగం ప్లీనరీకి వచ్చిన ప్రతినిధులకు కొంతమేర ఊరటనిచ్చింది. కొన్నాళ్లుగా ప్రత్యర్థులపై ఎదురుదాడి, పదునైన తిట్ల దండకంతో విరుచుకుపడుతున్న టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తన సహజ శైలికి భిన్నంగా కనీసం ప్రత్యర్థి పేరు ప్రస్తావించకుండా ప్లీనరీలో మాట్లాడటం చర్చనీయాంశమైంది. […]
[…] Best Cars in India: అప్పుడెప్పుడో ‘అంబాసిడర్’లో తిరిగిన మనం ఇప్పుడు ‘బెంజ్’ కార్లు వాడుతున్నాం. నాడు అంబాసిడరే చాలా గొప్ప. అదొక పెద్ద స్టేటస్ సింబల్. కానీ నేడు బెంజ్ లు.. అంతకుమించిన కార్లు మార్కెట్లోకి వచ్చాయి. ఎన్నో అత్యాధునిక కార్లు మార్కెట్ లను ముంచెత్తుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన కార్లు దేశంలో దిగుమతి అవుతున్నాయి. […]
[…] Virat Kohli: భారత్ జట్టు మాజీ సారధి విరాట్ కోహ్లి ప్రస్తుతం ఫామ్ కొనసాగించడం లేదు ఒకప్పుడు తన బ్యాట్ తో మ్యాజిక్ చేసిన అతడు ప్రస్తుతం తడబడుతున్నాడు. పరుగులు చేయడంలో వెనుకంజ వేస్తున్నాడు. ఫలితంగా విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. ఇండియాకు ఎన్నో విజయాలు అందించినా ప్రస్తుతం మాత్రం అతడి కెరీర్ ప్రశ్నార్థకంగానే మారుతోంది. ఇంకా ఆరేడేళ్లు తనదైన ముద్ర వేసి టీమిండియాకు సేవలందించాలని అనుకుంటున్నా అతడి అదృష్టం తలకిందులవుతోంది. దీంతో జట్టు నుంచి తప్పుకోవాలనే వాదనలు రావడం సహజమే. […]
[…] Talasani Srinivas Yadav: అధికార పార్టీ అయితే ఒకతీరు ప్రతిపక్ష పార్టీలకైతే మరోతీరా? ప్రజాస్వామ్యంలో ఎందుకింత వివక్ష. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. పైగా వారే నీతులు మాట్లాడతారు. నగరంలో బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి జెండాలు, కటౌట్లతో నగరాన్ని నింపేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆక్షేపించారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగి అధికార పార్టీ నేతలకు జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది. […]