OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్త సినీ అభిమానులకి పరిచయం అక్కర్లేని పేరు అవతార్. గతంలో వరల్డ్ ఫిల్మ్ రికార్డులని తుడిచిపెట్టిన ఈ చిత్రానికి వరుసగా సీక్వెల్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగా అవతార్ 2 ఈ ఏడాది డిసెంబర్ 16న రాబోతోంది. అయితే ఇప్పటివరకు ఫస్ట్‌లుక్ టీజర్లు విడుదల కాలేదు. నేడు లాస్‌వేగాస్‌లో థియేటర్ ఓనర్స్ హాజరయ్యే సినిమాకాన్ వేడుకలో, వారికి ప్రత్యేకంగా అవతార్ 2 టీజర్ వేస్తారని తెలుస్తోంది.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మరపురాని విజయాన్ని అందించిన ఖుషీ చిత్రానికి ఇవాళ్టితో సరిగ్గా 21 ఏళ్లు. ఈ సందర్భంగా భూమిక చావ్లా ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ను పోస్ట్ చేసింది. ఈ సినిమాలో మధుగా తనకు దక్కిన గుర్తింపును ప్రధానంగా ప్రస్తావించింది.. తనకు జోడీగా నటించిన పవన్‌తో పాటు చిత్ర దర్శకుడు ఎస్‌జే సూర్య, నిర్మాత ఏఎం రత్నంలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.
Also Read: Tamannaah: తమన్నా పై మళ్లీ పుకార్లు.. నిజానిజాల మాటేమిటి ?

మరో క్రేజీ అప్ డేట్ ఏమిటంటే.. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు మరో షాక్ తగిలింది. ఇటీవలే ఐటీ నోలీసులు అందుకున్న ఆయనకు తాజాగా జీఎస్టీ శాఖ నోటీసులు జారీ అయ్యాయి. రూ.1.8 కోట్ల మేర పన్ను కట్టాలంటూ జీఎస్టీ చెన్నై శాఖ నుంచి ఇవాళ ఇళయరాజాకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ మొత్తానికి వడ్డీ, జరిమానా అధికమని కూడా ఆ నోటీసుల్లో జీఎస్టీ తెలిపింది.

అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. తమిళ మూవీల్లో నటిస్తూనే మరో పక్క బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో మెరుస్తున్నాడు కోలీవుడ్ హీరో ధనుష్. ఇప్పటికే ది ఎక్స్‌ట్రార్డినరీ జెర్నీ ఆఫ్ ఫకీర్ అనే హాలీవుడ్ మూవీలో టైటిల్ రోల్ చేసిన ధనుష్.. ఈ ఏడాది ది గ్రేమేన్ అనే యాక్షన్ మూవీతో అలరించనున్నాడు.
ఈ మూవీలో తన లుక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అగ్రెసివ్ లుక్‌లో ధనుష్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా జూన్ 22న నెట్ ఫ్లిక్స్‌లో విడుదల కాబోతుంది.
Also Read:KGF 2: లాభాల్లో ‘రాఖీ భాయ్’.. డబ్ చిత్రాల్లో సరికొత్త రికార్డు !
Recommended Videos:





[…] F3 Movie Song: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇటీవల ‘ఊ ఆ అహ అహ’ అనే లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. […]
[…] RRR Movie Etthara Jenda Song: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ బాక్సాఫీస్ మాత్రమే కాదు, అయితే, ఈ సినిమాలో ఎన్టీఆర్ – చరణ్ కలిసి చేసిన ‘ఎత్తర జెండా’ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వారానికో ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేస్తూ సినీ అభిమానుల్ని అలరిస్తోంది ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందం. […]