https://oktelugu.com/

Uday Kiran Shocking News: షాకింగ్.. ఉదయకిరణ్ చనిపోయ్యే చివరి క్షణం ముందు ఆ ముగ్గురు డైరెక్టర్స్ తో ఏమి మాట్లాడాడో తెలుసా??

Uday Kiran Shocking News: తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి అతి తక్కువ సమయం లోనే వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరో ఉదయకిరణ్..ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయినా ఉదయ్ కిరణ్ తొలి సినిమా తోనే సెన్సషనల్ హిట్ కొట్టి ఆరోజుల్లోనే 9 కోట్ల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 27, 2022 / 06:25 PM IST
    Follow us on

    Uday Kiran Shocking News: తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి అతి తక్కువ సమయం లోనే వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరో ఉదయకిరణ్..ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయినా ఉదయ్ కిరణ్ తొలి సినిమా తోనే సెన్సషనల్ హిట్ కొట్టి ఆరోజుల్లోనే 9 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టాడు..ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ తేజ దత్సకత్వం లోనే ఉదయకిరణ్ రెండవ చిత్రం నువ్వు నేను సినిమా విడుదల అయ్యి సెన్సషనల్ హిట్ అయ్యింది..ఇలా కేవలం రెండు సినిమాలతోనే అప్పట్లో యూత్ ని ఊపేసాడు ఉదయ్ కిరణ్..ఈ రెండు సినిమాల తర్వాత ప్రముఖ దర్శకుడు వన్ ఆదిత్య తో చేసిన మనసంతా నువ్వే సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సషనల్ హిట్ అయ్యింది..మన టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి తొలి మూడు సినిమాల తోనే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లే రేంజ్ హిట్లు కొట్టిన ఏకైక హీరో గా సరికొత్త చరిత్ర సృష్టించాడు ఉదయ్ కిరణ్.

    Uday Kiran Shocking News

    ఇలా వరుసగా మూడు సినిమాలు భారీ హిట్ అవ్వడం తో ఉదయ్ కిరణ్ తో సినిమాలు చెయ్యడానికి టాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాతలు పోటీ పడేవారు..ఆయన నాల్గవ సినిమా ‘కలుసుకోవాలని’ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్..ఉదయకిరణ్ నడవడిక ,మంచితనం ని నచ్చి మెగాస్టార్ చిరంజీవి సైతం తన కూతురు సుస్మిత ని ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని అనుకున్నాడు..అప్పట్లో వీళ్లిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది..కానీ ఆ తర్వాత ఉదయ్ కిరణ్ మరియు సుస్మిత మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది..ఇక ఇక్కడి నుండి ఉదయ్ కిరణ్ డౌన్ ఫాల్ ప్రారంభం అయ్యింది..నిన్న మొన్నటి వరుకు అతనితో సినిమాలు చెయ్యడానికి క్యూ కట్టిన దర్శక నిర్మాతలు ఒక్కసారిగా మాయం అయిపోయారు..ఈ సంఘటన తర్వాత రెండు హిట్స్ తగిలినప్పటికీ కూడా ఉదయ్ కిరణ్ అంతకు ముందు స్థాయిలో క్రేజీ ఆఫర్లు రావడం తగ్గిపోవడం తో తన స్టార్ స్టేటస్ ని కోల్పోయాడు.

    Also Read: ఆదిపురుష్ మూవీ పై KTR వివాదాస్పద వ్యాఖ్యలు

    ఉదయ్ కిరణ్ తో ‘మనసంతా నువ్వే’ వంటి సెన్సషనల్ హిట్ సినిమాని తీసిన VN ఆదిత్య ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో తనకి మరియు ఉదయకిరణ్ కి మధ్య ఉన్న సన్నిహిత్య సంబంధం ని నెమరువేసుకుంటూ కంటతడి పెట్టాడు..తనతో చనిపొయ్యే ముందు రోజు అర్థ రాత్రి దాదాపుగా 3 గంటల పాటు ఫోను లో మాట్లాడాడు అని..నేను బాధపడుతూ ఉంటె నన్ను ఓదారుస్తూ ‘మనం భవిష్యత్తు లో కచ్చితంగా సినిమా చేద్దాం అన్నయ్యా’ అన్నాడు అని , అతని మాటలు విన్నాక డిప్రెషన్ లో ఉన్న తనకి కొండంత ధైర్యం వచ్చింది అని, అలాంటి వ్యక్తి మరుసటి రోజు ఆత్మా హత్య చేసుకుంటాడు అని కలలో కూడా ఊహించలేదు అని..ఉదయ్ కిరణ్ అలాంటి పిరికి వాడు కాదు..కానీ ఎందుకు ఇలా చేసుకున్నాడో ఇప్పటికి నాకు అంతు చిక్కని ప్రశ్న అంటూ వన్ ఆదిత్య ఈ సందర్భంగా మాట్లాడాడు..అదే రోజు రాత్రి తనతో పాటు తేజ మరియు పూరి జగన్నాథ్ వంటి దర్శకులతో కూడా ఉదయ్ కిరణ్ ఫోన్ లో మాట్లాడాడు అని..అదే ఆయన చివరి మాటలు అవుతాయి అని ఊహించలేకపోయాము అని VN ఆదిత్య కంట తడి పెట్టుకుంటూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

    Also Read: వైరల్ అవుతున్న టుడే క్రేజీ అప్ డేట్స్ !

    Tags