Mokshagna Debut Movie: నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని మోక్షజ్ఞ తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. నందమూరి బాలకృష్ణగా కొడుకుగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఇప్పటివరకు తన ఎంట్రీ విషయంలో మాత్రం ఎందుకని ఈ జాప్యాన్ని పాటిస్తున్నాడో ఎవ్వరికి అర్థం కావడం లేదు. రోజు రోజుకి ఆయన నుంచి వచ్చే సినిమా లేట్ అయిపోతూ ఉండడంతో ప్రేక్షకులు సైతం ఆ సినిమా కోసం పట్టించుకోడమే మానేశారు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఇక ప్రశాంత్ వర్మ సైతం ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో బాలయ్య బాబు మరొక దర్శకుడితో మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి కల్కి మూవీ డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని చాలామంది అనుకున్నప్పటికి అది కూడా వర్కౌట్ కాలేదు. దాంతో ఇప్పుడు బాలయ్య బాబు మరోసారి తన ఆస్థాన దర్శకుడు అయిన క్రిష్ ను రంగంలోకి దింపబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య బాబు క్రిష్ తో మూడు సినిమాలు చేశాడు… ఇక అవి గౌతమీపుత్ర శాతకర్ణి, కథానాయకుడు, మహానాయకుడు కావడం విశేషం…
ఈ మూడు సినిమాల్లో గౌతమీపుత్ర శాతకర్ణి మంచి విజయాన్ని సాధించింది. మిగిలిన రెండు సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. అయినప్పటికి ఆయన చేతిలో మోక్షజ్ఞ పెట్టడం వెనక కారణమేంటి అంటే ఆయన అయితేనే మోక్షజ్ఞ మొదటి సినిమాకి న్యాయం చేస్తాడని బాలయ్య భావిస్తున్నాడు. ఆయనైతేనే ఒక సెన్సిబుల్ కాన్సెప్ట్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తాడు.
అలాగే మోక్షజ్ఞను డిఫరెంట్ గా ప్రేక్షకులకు పరిచయం చేస్తాడనే ఉద్దేశ్యంతోనే తనను రంగంలోకి దించుతున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ఘాటి సినిమా ఆశించైనా మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన మార్కెట్ భారీగా డౌన్ అయింది. ఇక ఈ సినిమాను చేసి మరోసారి తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం క్రిష్ కొంతవరకు డిప్రెషన్ లో ఉన్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. అటు పర్సనల్ లైఫ్ లోను, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లోను ఆయనకు సక్సెస్ లేకుండా పోతోంది. దానివల్లే ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాడని ఫ్రస్టేషన్లో ఉంటున్నాడని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఆయనను పరిచయం చేసే బాధ్యతను క్రిష్ తీసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…