Rajiv Kanakala about Baahubali: సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది నటులు ఉన్నప్పటికి కొంతమంది మాత్రమే విలక్షణ నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అందులో రాజీవ్ కనకాల ఒకరు. ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప ఐడెంటిటిని తీసుకొచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఆయన చాలా సినిమాల్లో చేస్తున్నప్పటికి ఆయన క్యారెక్టర్ ను అర్థంతరంగా చంపేస్తూ చనిపోయే క్యారెక్టర్స్ లో మాత్రమే రాజీవ్ కనకాల నటిస్తాడు అనే ఒక స్టేజ్ కి అతన్ని తీసుకొచ్చారు. కానీ కెరియర్ స్టార్టింగ్ లో ఆయన చాలా గొప్ప పాత్రలను పోషించాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిద్య భరితమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ సినిమాలో హీరో తండ్రిగా నటించి గొప్ప విజయాన్ని అందుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆయన అలాంటి ఒక జోవియల్ గా ఉండే క్యారెక్టర్ లో నటించానని రాజీవ్ కనకాల చెబుతుండటం విశేషం…ఇక గతంలో ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
బాహుబలి సినిమాలో తను ఎందుకు చేయలేదని రిపోర్టర్ అడగగా బాహుబలి సినిమా నుంచి తనకు ఆఫర్ వచ్చిందని కానీ అప్పుడు వేరే సినిమాకి 15 రోజుల పాటు డేట్స్ ఇచ్చి లాక్ అయిపోయి ఉండటం వల్ల బాహుబలి సినిమాను వదిలేసుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. అలాగే రాజమౌళి అడిగితే
ఎలాంటి పాత్రనైనా చేస్తాను.
అది ఎంత చిన్న పాత్రనైనా సరే చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని చెబుతూ ఉండటం విశేషం…ఇక అదే విధంగా రాజమౌళి చేసిన ఈగ సినిమాలో మొదట విలన్ పాత్ర కోసం మిమ్మల్ని అనుకున్నారట కదా అని రిపోర్టర్ అడిగగా ఆ క్వశ్చన్ కి రాజీవ్ కనకాల సమాధానం చెబుతూ ఏమో మరి నాకు తెలియదు. కానీ ఈగ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లాను అక్కడ గ్రీన్ మ్యాట్ రూమ్ మొత్తాన్ని సిద్ధం చేసిన జక్కన్న ఒకసారి రిహార్సల్స్ చేద్దాం అని అడిగితే చేశాను.
అంతే తప్ప ఆ క్యారెక్టర్ నేను చేస్తాను అని నేను అడగలేదు. రాజమౌళి నన్ను చేయండి నాకు చెప్పలేదు. రాజమౌళి నన్ను అనుకున్నాడనే న్యూస్ కూడా నేనెప్పుడూ వినలేదు అంటూ ఆయన సమాధానం చెప్పాడు. మొత్తానికైతే రాజమౌళికి తనకు ఉన్న ఫ్రెండ్షిప్ గురించి రాజీవ్ కనకాల చాలా గొప్పగా చెప్పాడు…ఇక మొత్తానికైతే రాజీవ్ కనకాల బాహుబలి మూవీ లో మిస్ చేసుకున్న పాత్ర ఏంటంటే ప్రభాస్ పోషించిన శివుడి క్యారెక్టర్ కి తండ్రి పాత్రనట… రాజమౌళి రాజీవ్ కనకాలను మొదట ఆ పాత్ర కోసం అనుకున్నప్పటికీ రాజీవ్ డేట్స్ క్లాష్ అవ్వడంతో ఆ పాత్ర ను వేరే ఆర్టిస్ట్ చేత చేయించాల్సి వచ్చిందట…