Devara: దేవర కోసం కొరటాల సరికొత్త టెక్నాలజీ ని వాడుతున్నారా..?

సరికొత్త టెక్నాలజీని కూడా కొరటాల శివ వాడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే హాలీవుడ్ కి చెందిన కొంత మంది ఎక్స్ పర్ట్ చేత ఆ టెక్నాలజీని ఇండియాకు తీసుకొచ్చి మరీ వాడుతున్నారట. ఇక దీని ద్వారా కొత్త టెక్నాలజీని కూడా జనానికి పరిచయం చేయబోతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : July 19, 2024 10:03 am

Devara

Follow us on

Devara: ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన దైన రీతిలో వరుస సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన దేవర సినిమాతో చాలా బిజీగా ఉన్నప్పటికీ బాలీవుడ్ లో వార్ 2 సినిమాని కూడా స్టార్ట్ చేసి ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. ఇక ఎన్టీయార్ లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ గాని, ఆయనకున్న మెమొరీ పవర్ గాని, ఆయన వేసే డాన్సులు గాని చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

Also Read: నాగ్ అశ్విన్, సందీప్ వంగ, హను రాఘవపూడి లు ఏ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్స్ గా పనిచేశారో తెలుసా..?

ఇక ఈ విషయం లో ఆయనకి సాటి ఎవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ తన దైన రీతిలో వరుస సక్సెస్ లను అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆరు సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాతో మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే కొరటాల శివ ఈ సినిమాని చాలా రిచ్ గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అందుకోసమే ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో గ్రాఫిక్స్ పార్ట్ చాలా కీలక పాత్రను పోషించబోతుందట.

ఇక దానికోసం ఒక సరికొత్త టెక్నాలజీని కూడా కొరటాల శివ వాడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే హాలీవుడ్ కి చెందిన కొంత మంది ఎక్స్ పర్ట్ చేత ఆ టెక్నాలజీని ఇండియాకు తీసుకొచ్చి మరీ వాడుతున్నారట. ఇక దీని ద్వారా కొత్త టెక్నాలజీని కూడా జనానికి పరిచయం చేయబోతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే కొరటాల శివ ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఎవరైతే తనని విమర్శించారో వాళ్ల చేతే సుభాష్ అనిపించుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే కొరటాల శివ దేవర సినిమాతో తీసుకొస్తున్న టెక్నాలజీ ఏంటి అనే విషయాన్ని మాత్రం సినిమా యూనిట్ బయటికి తెలియజేయడం లేదు అది సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి అంటూ ఒక సస్పెన్స్ ను అయితే క్రియేట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన తను అనుకున్న సక్సెస్ ని సాధిస్తాడా అలాగే తను తీసుకొచ్చిన టెక్నాలజీ మన సినిమాల విషయంలో వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే దేవర సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొన్నడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు మరో షెడ్యూల్ లో కూడా పాల్గొనాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనప్పటికీ ఎన్టీయార్ మాత్రం ఈ రెండు సినిమాలతో సక్సెస్ లను సాధిస్తే వరుసగా ఎనిమిది సక్సెస్ లను సాధించిన ఏకైక హీరోగా గుర్తింపు పొందుతాడు… ఇక ఇంతకుముందు ఉన్న హీరోలు ఇలాంటి ఘనతను సాధించినప్పటికీ ఇప్పుడున్న స్టార్ హీరోల్లో మాత్రం ఎవరూ ఇలాంటి ఒక ఫీట్ అయితే సాధించలేదు. కాబట్టి ఇది ఎన్టీఆర్ కి చాలా మంచి రికార్డ్ గా మిగలబోతుంది. తనను తాను స్టార్ హీరోగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి కూడా దీనికి మించిన మంచి అవకాశం మరొకటి రాదనే చెప్పాలి…చూడాలి మరి ఎన్టీయార్ ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటాడు అనేది…

Also Read: నెట్ ఫ్లిక్స్ కు వింత అనుభవం.. అనుకున్నది ఫట్టుమంది.. అనుకోనిది హిట్టయింది