Kalki 2898 Collections: కల్కి సినిమా వసూళ్లు ఎక్కడి దాకా వచ్చాయి.. అనిమల్ రికార్డ్ బ్రేక్ చేసిందా..?

కల్కి సినిమా మాత్రం చూసిన పదిమందిలో పదిమందికి నచ్చింది. ఎందుకంటే ఈ సినిమా మన పురాణాలను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా కావడం ఒకటైతే, ఇందులో గ్రాఫిక్స్ తో చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ గాని, వరల్డ్ బిల్డింగ్ గాని, విజువల్స్ గానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక ప్రతి ఒక్కరికి హాలీవుడ్ సినిమాను చూసిన ఫీల్ కలుగుతుంది. ఇంకా టెక్నాలజీ పరంగా కూడా చాలా అద్భుతమైన టెక్నాలజీని చూపించారు. ఈ సినిమా ఏ క్యాటగిరిలో చూసుకున్న ప్రతి ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చుతుంది.

Written By: Gopi, Updated On : July 7, 2024 10:53 am

Kalki 2898 Collections

Follow us on

Kalki 2898 Collections: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా 10 రోజుల్లో భారీ కలెక్షన్ల ను వసూలు చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు సాగుతుడటం విశేషం…ఇక మొత్తానికైతే ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని ఇవ్వడం నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఎంత పెద్ద హిట్ సినిమా అయిన కూడా పదిమంది చూస్తే అందులో కనీసం ఇద్దరికైన నచ్చదు.

కానీ కల్కి సినిమా మాత్రం చూసిన పదిమందిలో పదిమందికి నచ్చింది. ఎందుకంటే ఈ సినిమా మన పురాణాలను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా కావడం ఒకటైతే, ఇందులో గ్రాఫిక్స్ తో చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ గాని, వరల్డ్ బిల్డింగ్ గాని, విజువల్స్ గానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక ప్రతి ఒక్కరికి హాలీవుడ్ సినిమాను చూసిన ఫీల్ కలుగుతుంది. ఇంకా టెక్నాలజీ పరంగా కూడా చాలా అద్భుతమైన టెక్నాలజీని చూపించారు. ఈ సినిమా ఏ క్యాటగిరిలో చూసుకున్న ప్రతి ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చుతుంది.

కాబట్టి దీన్ని రిపీటెడ్ గా ఆడియోన్స్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందువల్లే ఈ సినిమా వందల కోట్ల కలెక్షన్లను రాబడుతుంది.. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు 800 కోట్లకు పైన వసూళ్లను సాధించింది. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘అనిమల్ ‘ సినిమా లాంగ్ రన్ లో 900 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఇప్పటి వరకైతే అనిమల్ సినిమా రికార్డును కల్కి మూవీ బ్రేక్ చేయలేదు.

కానీ మరో రెండు రోజుల్లో కల్కి ఈ రికార్డును బ్రేక్ చేసి 1000 కోట్ల మార్క్ ను కూడా అందుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ని చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయొచ్చని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…