https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ తో మరోసారి జతకట్టనున్న స్టార్ హీరోయిన్…

ఒకప్పుడు ప్రభాస్ తో నటించి మంచి విజయాలను అందుకున్న నటి త్రిష...వర్షం సినిమాతో వీళ్ళ కాంబినేషన్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత పౌర్ణమి, బుజ్జిగాడు లాంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించడమే కాకుండా ఇండస్ట్రీలో ఏ హీరో హీరోయిన్ల మధ్య వర్కౌట్ కానీ కెమిస్ట్రీ వీళ్ళ కాంబో లో మాత్రం చాలా బాగా వర్క్ అవుట్ అయ్యేది. అందుకే వీళ్ళిద్దరి కాంబినేషన్ ను మరోసారి సెట్ చేయాలనే ఉద్దేశ్యం లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్, త్రిష కాంబినేషన్ మరోసారి స్క్రీన్ మీద కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : July 7, 2024 / 10:46 AM IST

    Prabhas

    Follow us on

    Prabhas: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లా కాంబినేషన్ కు చాలా మంచి గుర్తింపు ఉంటుంది. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వచ్చిందంటే ఆ సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్క్ అవుట్ అయిందా లేదా అనే ఉద్దేశ్యం లోనే ప్రతి ప్రేక్షకుడు కూడా చూస్తుంటాడు. ఒకవేళ వాళ్ళ మధ్య కనక మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్టైతే వాళ్ల కాంబినేషన్ ను మరొక సినిమాలో రిపీట్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉంటారు.

    ఇక ఈ క్రమంలోనే ఒకప్పుడు ప్రభాస్ తో నటించి మంచి విజయాలను అందుకున్న నటి త్రిష…వర్షం సినిమాతో వీళ్ళ కాంబినేషన్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత పౌర్ణమి, బుజ్జిగాడు లాంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించడమే కాకుండా ఇండస్ట్రీలో ఏ హీరో హీరోయిన్ల మధ్య వర్కౌట్ కానీ కెమిస్ట్రీ వీళ్ళ కాంబో లో మాత్రం చాలా బాగా వర్క్ అవుట్ అయ్యేది. అందుకే వీళ్ళిద్దరి కాంబినేషన్ ను మరోసారి సెట్ చేయాలనే ఉద్దేశ్యం లో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ సినిమాలో ప్రభాస్, త్రిష కాంబినేషన్ మరోసారి స్క్రీన్ మీద కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది.

    అయితే ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడట…ఇక తండ్రి కొడుకు రెండు పాత్రలను తనే చేస్తున్నాడు. కాబట్టి తండ్రి క్యారెక్టర్ పక్కన త్రిష కూడా ఉంటుందని తెలుస్తుంది. హీరో తండ్రికి ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుందట. ఇక ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వచ్చే సీన్స్ లో త్రిష ప్రభాస్ లా జోడి కనిపిస్తుందట. ఆ సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయని సినిమా యూనిట్ నుంచి సమాచారమైతే అందుతుంది.

    ఇక ప్రస్తుతం త్రిష చిరంజీవి తో ‘ విశ్వంభర ‘ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. కాబట్టి తను మరికొన్ని తమిళ్ సినిమాల్లో కూడా నటిస్తు చాలా బిజీగా ఉంది. మరి స్పిరిట్ సినిమా పుణ్యమాని స్క్రీన్ మీద మరోసారి ప్రభాస్ త్రిష ని చూడవచ్చు అంటూ ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు…