Kanguva: కంగువ నైజాం రైట్స్ దక్కించుకున్న స్టార్ ప్రొడ్యూసర్…తెలుగు లో వర్కౌట్ అవుతుందా..?

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య అద్భుతమైన పాత్రలో నటించబోతున్నాడు అనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.

Written By: Gopi, Updated On : July 5, 2024 9:04 am

Kanguva

Follow us on

Kanguva: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నటుడు సూర్య. ప్రస్తుతం ఆయన ‘కంగువ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 10న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇదిలా ఉంటే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య అద్భుతమైన పాత్రలో నటించబోతున్నాడు అనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ సినిమాతో ఒక భారీ ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక విలన్ గా బాబీ డియోల్ మరొక మెట్టు పైకెక్కబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే కంగువ సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని ఎవరు తీసుకున్నారు.

అనే దానిపైన గత కొద్ది రోజుల నుంచి చర్చ అయితే నడుస్తుంది. ఇక మొత్తానికైతే మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు కంగువ సినిమా నైజాం రైట్స్ తీసుకోవడం ఆ సినిమాకు చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తెలుగు లో టాప్ ప్రొడ్యూసర్స్ గా కొనసాగుతున్నారు.
అలాంటివారు తమ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసి రిలీజ్ చేస్తున్నారంటే సినిమాకి నైజాం లో భారీ రేంజ్ లో హైప్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా మీద ఇప్పటికే పాన్ ఇండియా లో చాలా మంచి హైప్ ఐతే ఉంది.

మరి దసరాను టార్గెట్ చేసుకొని సినిమా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో తెలియాల్సి ఉంది…ఇక ఇప్పటికే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటానని సూర్య మాత్రం చాలా కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నాడు…ఇక ఈ సినిమా ఆడితే పర్లేదు కానీ ఒకవేళ బోల్తా కొడితే మాత్రం మైత్రి వాళ్ళకి నష్టాలు తప్పవు…