NTR And Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని ముందుకు దూసుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే…అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో తమ సత్తాను చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు.
ఇక అందులో భాగంగానే ప్రభాస్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం ఎవరికి అందనంత ఎత్తులో సినిమాలు తీస్తూ సక్సెస్ లు సాధిస్తుంటే మిగిలిన స్టార్ హీరోలు అందరూ కూడా ప్రభాస్ నడిచిన బాటలోనే నడుస్తున్నారు. ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు కూడా బాలీవుడ్ లో భారీ కలెక్షన్లను రాబట్టారు. అలాగే అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల బాలీవుడ్ రైట్స్ భారీ రేట్ కి అమ్ముడుపోయాయి అని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కోసం దాదాపు 70 కోట్లు పెట్టి హిందీ రైట్స్ ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
అలాగే ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమా కోసం బాలీవుడ్ వాళ్లు 50 కోట్లు కేటాయించి ఆ రైట్స్ ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇది చూసిన చాలామంది ఎన్టీయార్ అభిమానులు రామ్ చరణ్ తో పోల్చుకుంటే ఎన్టీఆర్ ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక సోషల్ మీడియా మొత్తం లో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది…
రామ్ చరణ్ తో పోల్చుకుంటే ఎందుకు ఎన్టీఆర్ సినిమాని తక్కువ అంచనా వేస్తున్నారు అంటూ మరి కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ రెండు సినిమాల మధ్య మంచి పోటీ అయితే ఉంది. ఇక ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…