https://oktelugu.com/

Junior NTR: జూనియర్ ఎన్టీయార్ వల్లే ఆ స్టార్ హీరో కెరియర్ డ్యామేజ్ అయిందా..?కారణం ఏంటి..?

ఒకప్పుడు ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'బాద్షా ' సినిమా అవరేజ్ గా ఆడింది. అయితే ఈ సినిమాలో సిద్ధార్థ్ ఒక కీలకపాత్రలో నటించాడు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా వేరే హీరోను అనుకున్నప్పటికి ఎన్టీఆర్ మాత్రం పట్టు పట్టి సిద్ధార్థ్ ని ఆ క్యారెక్టర్ లో తీసుకున్నారట. ఇక సిద్దు ఈ సినిమాలో ఎన్టీయార్ బ్రదర్ క్యారెక్టర్ లో నటించాడు. అయితే ఒక బాంబ్ బ్లాస్ట్ లో ఆయన చనిపోతాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 8, 2024 / 03:09 PM IST

    Junior NTR

    Follow us on

    Junior NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్.. ఈయన హీరోగా చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ భారం మొత్తాన్ని తనే మోస్తున్నాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా కూడా గుర్తింపు పొందిన ఆయన రాబోయే సినిమాలతో భారీ సక్సెస్ లను కొత్తాడు. ఇక ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికీ ఎలాంటి మార్కెట్ అయితే ఉందో వాళ్ళని మించి తను ఇంకొక అడుగు ముందుకు వేయాలని చూస్తున్నాడు.

    ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘బాద్షా ‘ సినిమా అవరేజ్ గా ఆడింది. అయితే ఈ సినిమాలో సిద్ధార్థ్ ఒక కీలకపాత్రలో నటించాడు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా వేరే హీరోను అనుకున్నప్పటికి ఎన్టీఆర్ మాత్రం పట్టు పట్టి సిద్ధార్థ్ ని ఆ క్యారెక్టర్ లో తీసుకున్నారట. ఇక సిద్దు ఈ సినిమాలో ఎన్టీయార్ బ్రదర్ క్యారెక్టర్ లో నటించాడు. అయితే ఒక బాంబ్ బ్లాస్ట్ లో ఆయన చనిపోతాడు. ఇక అలాంటి ఒక చిన్న పాత్రలో కనిపించినందుకే సిద్ధార్థ్ కి అప్పటినుంచి తన కెరీర్ లో హీరోగా మంచి అవకాశాలు అయితే రావడం లేదనే చెప్పాలి.

    ఇక ఇప్పుడు ఆలోచించినట్టుగా ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆలోచించే వాళ్ళు కాదు. ఒక క్యారెక్టర్ లో ఏ హీరోనైనా చూస్తే అలాంటి క్యారెక్టర్ లోనే ఆ హీరో నటించాలి అనుకునేవారు. ఇక వాళ్లకు హీరోగా అవకాశాలు కూడా పెద్దగా వచ్చేవి కావు. సిద్ధార్థ్ విషయంలో కూడా అదే జరిగిందని పలువురు సినీ విమర్శకులు కూడా ఒకానొక సందర్భంలో తెలియజేశారు.

    ఇక సిద్ధార్థ్ కెరియర్ డల్ అవ్వడానికి ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా కారణమయ్యాడనే చెప్పాలి… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సిద్ధార్థ్ భారతీయుడు 2 సినిమాల్లో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో ఆయన మరోసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలనే ప్రయత్నాన్ని చేస్తున్నాడు…