Shyam Singaroy Movie: తనదైన సహజ నటనతో అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు నాచురల్ స్టార్ నాని. విభిన్న పాత్రలు, విభిన్న కధాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం నాని ” శ్యామ్ సింగ రాయ్ ” అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి “టాక్సీవాలా” దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం చేస్తున్నాడు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పిరియడికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీలో నాని సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిళ్ను గా చేస్తున్న ఈ మూవీలో వారి పాత్రల గురించి అదిరిపోయే అప్డేట్ ను రివీల్ చేశాడు నాని.

“శ్యామ్ సింగరాయ్” చిత్రంలో హీరోయిన్ల పాత్రకు సంబంధించి ఓ హింట్ ను ఇచ్చారు నాని. దీపావళి పండుగ సంధర్భంగా తన ముగ్గురు హీరోయిన్ల గురించి ట్వీట్ చేశాడు నాని. సాయి పల్లవి పాత్ర గురించి హింట్ ఇస్తూ ‘టైమ్’ అని చెప్పుకొచ్చారు. అలానే మడోన్నా పాత్ర గురించి రాస్తూ – నిజం అని… కృతి శెట్టికి – మెమోరీ అనే పదాన్ని వాడారు. ఇప్పుడు ఈ పోస్ట్ ను బట్టి వారి వారి పాత్రలకు సంబంధించిన వివరాలను అంచనా వేసే పనిలో పడ్డారు నెటిజన్లు. ఈ ట్వీట్ తో అనుమానాలతో పాటు అంచనాలను కూడా… నాని పెంచేశాడు అని చెప్పవచ్చు.
The TRIDENT 🔱 of #ShyamSinghaRoy that surpasses
TRUTH @MadonnaSebast14
MEMORY @IamKrithiShetty and
TIME @Sai_Pallavi92wishing you all a Very #HappyDiwali #SSRonDEC24th 💥@Rahul_Sankrityn @MickeyJMeyer @vboyanapalli @NiharikaEnt @SSRTheFilm pic.twitter.com/6J4vivTp6A
— Nani (@NameisNani) November 4, 2021
ఈ చిత్రం తెలుగుతో పాటూ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 24న విడుదల కానుంది. ఇటీవల ఈ మ్వోయిఏ నుంచి రైజ్ ఆఫ్ శ్యామ్ అనే లిరికల్ ను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. అలానే నందమూరి నటసింహం బాలయ్య నటిస్తున్న అఖండ చిత్రం కూడా క్రిస్మస్ కు విడుదల కాబోతుంది. అలాగే డిసెంబర్ 17న అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో శ్యామ్ సింగ రాయ్ విడుదల పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.