Rama Prabha: ఇండస్ట్రీ లో ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయిన ఒకప్పటి హీరోయిన్…

నటి రామప్రభ..ఈమె 1946 వ సంవత్సరంలో చిత్తూరు జిల్లాలోని వాల్మీకిపురంలో జన్మించింది. ఇక మరి కొంతమంది మాత్రం ఆమె కదిరిలో పుట్టిందని చెబుతూ ఉంటారు.

Written By: Gopi, Updated On : May 5, 2024 5:24 pm

Rama Prabha

Follow us on

Rama Prabha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి రామప్రభ..ఈమె 1946 వ సంవత్సరంలో చిత్తూరు జిల్లాలోని వాల్మీకిపురంలో జన్మించింది. ఇక మరి కొంతమంది మాత్రం ఆమె కదిరిలో పుట్టిందని చెబుతూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉంటే ఈమె చిన్నప్పటి నుంచి 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు తన మేనత్త దగ్గర పెరిగింది.

అయితే వీళ్ళ మేనత్త ఊటీ లో ఉండేది. ఇక రమాప్రభ కూడా అక్కడే ఉండేది. అందువల్లే మొదట తనకు తెలుగు సరిగ్గా వచ్చేది కాదు. ఇక 14 సంవత్సరాలకే మద్రాస్ కు వచ్చిన ఆవిడ నాటక రంగంలో ప్రావీణ్యం చూపిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక అదే సమయంలో తమిళ్ డైరెక్టర్ కృష్ణన్ పంచు సినిమాలో ఆమెకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఇక లెజెండరీ నటుడు అయిన పద్మనాభం లీడ్ రోల్లో వచ్చిన చిలక గోరింక సినిమాలో పద్మనాభం కు జోడిగా నటించి మెప్పించింది.

ఇక దానికి తోడుగా పద్మనాభం, రమాప్రభ జోడి చాలా సంవత్సరాల పాటు తెలుగు స్క్రీన్ మీద అలరిస్తు వచ్చిందనే చెప్పాలి. ఇంకా దానికి తోడుగా అల్లు రామలింగయ్య రాజబాబు లు కూడా రమాప్రభ తో చాలా సంవత్సరాల పాటు కాంబినేషన్ మెయింటైన్ చేస్తూ స్క్రీన్ మీద వీళ్ళు కనబడగానే నవ్వులు పువ్వులు పూయించేవారు. అల్లు రామలింగయ్య రమాప్రభ ను చూస్తూ ‘ముత్యాలు వస్తావా’ అనే సాంగ్ కూడా పాడాడు అంటే ఆమె అందంతో ఎలా మ్యాజిక్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమె కంటే చిన్నవాడు అయిన శరత్ బాబును ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

12 సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు.
ఇక మధ్యలో వచ్చిన వివాదాల కారణంగా వాళ్ళు విడిపోయారు. ఇక ప్రస్తుతం ఆమె అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఒకానొక టైంలో ఆమె నమ్మిన వారే ఆమెను మోసం చేశారు… ఇక ఆమెకు తినడానికి కూడా తిండి లేని సమయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆమెకు మంత్లి కొంత అమౌంట్ ఇచ్చి సహాయం చేస్తున్నాడని స్వయంగా ఆమె చెప్పడం విశేషం…