Brain Sharp Foods: ఈ ఫుడ్ ఇవ్వండి మీ పిల్లల బ్రెయిన్ షార్ప్ అవుతుంది..

కోడిగుడ్లు.. కోడిగుడ్లు చాలా పౌష్టికాహారం. పిల్లలకు ప్రతి రోజు ఒక గుడ్డు ఇవ్వాలి. దీన్ని తినడం వల్ల బ్రెయిన్ యాక్టీవ్ గా అవుతుంది. అదే విధంగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. పెద్ద వారు కూడా ఈ ఎగ్ ను తినడం ముఖ్యం.

Written By: Swathi, Updated On : May 5, 2024 5:20 pm

Brain Sharp Foods

Follow us on

Brain Sharp Foods: నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. దేశం బాగుండాలంటే పౌరులు బాగుండాలి. అయితే వీరి ఆరోగ్యం కూడా అదే రేంజ్ లో బాగుండాలి. మీ పిల్లల్లో బ్రెయిన్ ఎదుగుదల వారి ఫోకస్ అన్నీ కూడా మీ చేతుల్లోనే ఉంటాయి. అన్ని అవయవాల పెరుగుదల ఎంత ముఖ్యమో అదే విధంగా బ్రెయిన్ పెరుగుదల కూడా ముఖ్యమే. ఇక వారి ఫోకస్ పెరిగేతందుకు కొన్ని ఆహారాలు కూడా అవసరం. మరి మీరు ఎలాంటి ఆహారాలు ఇస్తున్నారు. అందులో ఇవి ఉంటున్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి.

కోడిగుడ్లు.. కోడిగుడ్లు చాలా పౌష్టికాహారం. పిల్లలకు ప్రతి రోజు ఒక గుడ్డు ఇవ్వాలి. దీన్ని తినడం వల్ల బ్రెయిన్ యాక్టీవ్ గా అవుతుంది. అదే విధంగా జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. పెద్ద వారు కూడా ఈ ఎగ్ ను తినడం ముఖ్యం.

బెర్రీలు.. ఇవి తినడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు. కొందరు పిల్లలను బెర్రీలను ఇష్టంగా తింటారు. దీని వల్ల కూడా పిల్లల బ్రెయిన్ షార్ప్ గా ఉంటుందట. ఇక నారింజ పండ్ల వల్ల కూడా పిల్లల బ్రెయిన్ షార్ప్ అవుతుంది. సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అందుకే పిల్లల పండ్లలో నారింజ పండ్లు ఉంటే వారి ఆరోగ్యం మాత్రమే కాదు గ్రహణ శక్తి కూడా పెరుగుతుంది.

విటమిన్ సి వల్ల గ్రహణ, మెమరీ, ఏకాగ్రత వంటివి వేగంగా పెరుగుతాయి. అంతేకాదు నట్స్, బ్రోకలీ, ఆకుకూరలు కూడా తరచూ తీసుకోవాలి. వీటి వల్ల విటమిన్ ఎ, కె, ఐరన్ వంటివి అందుతాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. బ్రెయిన్ ఆక్టివ్ గా, షార్ప్ గా ఉంటుంది. ఇక రోజుకు ఒక అరటి పండును కూడా తినండి.