Mrunal Thakur: ఇప్పుడు స్టార్ హీరోయిన్ లు గా కొనసాగున్న కొందరు హీరోయిన్ లు ఒకప్పుడు అవమానాలు, బాడీ షేమింగ్ కు గురైనవారే. అవమానకర వ్యాఖ్యలు చేసినా భరించి దృడ సంకల్పంతో ముందుకు సాగి స్టార్లుగా ఎదుగుతారు. అందులో ఒకరు మృణాల్ ఠాకూర్. ఈమె టీవీ షోలతో కెరీర్ ను ప్రారంభించి సీతారామం, జెర్సీ, హాయ్ నాన్న, ఘోస్ట్ స్టోరీస్, ది ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో ఎంతో పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాల్లో ఈమె నటకు అభిమానులే ఫిదా అయ్యారు.
ఇక మృణాల్ ఠాకూర్ కూడా ఎన్నో సార్లు బాడీ షేమింగ్ కు గురైందట. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. తను ఒక మీటింగ్ కు వెళ్లినప్పుడు ఓహ్ మృణాల్ నువ్వు అసలు సెక్సీగా లేవు అన్నారట. ఆయన పాత్ర గురించి మాట్లాడుతున్నారా? వ్యక్తిగతం గురించి మాట్లాడుతున్నారా అని అడిగిందట. కానీ ఆ పాత్ర సెక్సీగా ఉన్నా, ఆ పాత్రకు తను మాత్రం కొంచెం కూడా సూట్ కాలేదు అని అవమానించారట. అయితే లుక్ టెస్ట్ చేయండి అని అడిగిందట.
లుక్ టెస్ట్ కోసం ఫోటోగ్రాఫర్ వచ్చి ఈ పల్లెటూరు అమ్మాయి ఎవరు అన్నారట. కానీ తర్వాత ఆయననే క్షమాపణలు చెప్పారట. ఇక పల్లెటూరు అమ్మాయి అన్న ఆ వ్యక్తి ఎవరో రివీల్ చేయలేదు మృణాల్. అయితే ఈ భామ ముద్దు సీన్లు ఎక్కువగా ఉన్న సినిమాలను వదులుకుంటున్నట్టు వెల్లడించింది. తన పేరెంట్స్ వాటిని అంగీకరించరట. మొత్తం మీద తల్లిదండ్రులను ఒప్పించి కొన్ని సినిమాలను ఒప్పుకుందట.
ఇక రొమాంటిక్ సన్నివేశాలు తనకు ఇబ్బందిగా అనిపించేవట. వాటిని చేయాలంటే కూడా భయపడేదట. అందుకే నో అని చెప్పేదట. ఎంతకాలం అలా భయపడుతూ ఉండటం అని ఒక రోజు తన నాన్నతో మాట్లాడిందట. కొన్ని సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఉంటాయని ఇష్టం లేకపొయినా చేయాల్సి వస్తుంది అని చెప్పిందట. ఇక మొత్తం మీద రీసెంట్ గా విజయ్ దేవరకొండతో రొమాంటిక్ డ్రామా ది ఫ్యామిలీ స్టార్ లో నటించి మెప్పించింది ఈ భామ. మరి ముందు ముందు మరెలాంటి సినిమాల్లో నటిస్తుందో చూడాలి.