Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Soubin Shahir: హీరో అనే పదానికి అర్థం మార్చిన ఈయన ఎవరో తెలుసా?

Soubin Shahir: హీరో అనే పదానికి అర్థం మార్చిన ఈయన ఎవరో తెలుసా?

Soubin Shahir: హీరో అవ్వాలంటే ఆయన స్సెషల్ గా ఉండాలి. హైట్, వెయిట్, ఫిజిక్, అందం అన్నీ కూడా స్పెషల్ గా ఉండాలి. తనకంటూ స్పెషల్ లుక్ ఉండాలి అనుకుంటారు. మామూలు వ్యక్తిలాగా ఉంటే పెద్దగా పట్టించుకోరు. నటుడు కావాలంటే నటన వస్తే చాలు కానీ హీరో అవ్వాలంటే మాత్రం పైన చెప్పినా అన్ని అంశాలు ఉండాల్సిందే అనే బ్రమలో ఉంటారు చాలా మంది. కానీ ఇవన్నీ తప్పని నిరూపించారు ఓ హీరో. ఇంతకీ అతను ఎవరు? ఎలా నిరూపించారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ పాత్రను చూస్తున్నంత సేపు హీరో కాకుండా పాత్ర మాత్రమే చూడాలి అనిపిస్తుంది. పాత్ర చుట్టూనే సినిమా తిరుగుతుంది అనిపించేంతలా నటించాలి. మొత్తం మీద పాత్రకు న్యాయం చేయాలి. అప్పుడే హీరో అవుతారు. అంతేకానీ సన్నగా ఎత్తుగా ఉంటే మాత్రమే హీరో అనిపించుకోరు అని ఈ హీరోను చూస్తే అర్థం అవుతుంది. దీన్ని నిరూపించారు సౌబిన్ షాహిర్. ఇతను చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కొందరికి తెలియకపోవచ్చు. కానీ మనిషిని చూస్తే మాత్రం కచ్చితంగా గుర్తు పడతారు.

కొన్ని సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించారు. 2018లో వచ్చిన సుడాని ఫ్రం నైజీరియా అనే సినిమాలో హీరోగా నటించి మెప్పించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవడం మాత్రమే కాదు టాలెంట్ ఉంటే ఎలాంటి వారు అయినా హీరో అవచ్చు అని నిరూపించారు. ఆ తర్వాత కుంబలంగి నైట్స్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో సాబిన్ షాహిర్ ను ఇండియా మొత్తం మెచ్చుకుంది. ఇది 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి చాలా మందికి ఈయన అభిమాన హీరో అయ్యారు.

గత సంవత్సరంలో రోమాంచం సినిమాలో హీరోగా నటించారు ఈయన. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించారు. ఇటీవల మంజుమ్మిల్ బాయ్స్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని స్వయంగా ఈయనే నిర్మించారు. ఈయన ఓటీటీలో రిలీజ్ అయిన ఎన్నో మలయాళ సినిమాలకు తెలుగు డబ్బింగ్ సినిమాలు చేస్తూ ఫేమస్ అయ్యారు. మొత్తం మీద హీరో అన్న పదానికి అర్థం మార్చి హీరో పాత్రకు న్యాయం చేసి సినిమాను తన భుజాల మీద నడిపించాలి అని నిరూపించారు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version