Coolie Movie Monica Video Song: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth), లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కూలీ'(Coolie Movie) చిత్రం నుండి నిన్ననే ‘మోనికా’ అనే పాట ని మేకర్స్ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాటకు ఫ్యాన్స్ నుండి మామూలు రేంజ్ రెస్పాన్స్ రాలేదు. ముఖ్యంగా పూజ హెగ్డే(Pooja Hegde) డ్యాన్స్ కి యూత్ ఆడియన్స్ మెంటలెక్కిపోతున్నారు. మొట్టమొదటిసారి అనిరుద్(Anirudh Ravichander) మ్యూజిక్ ని ఈ పాటలోని ఆర్టిస్టుల డ్యాన్స్ పెర్ఫార్మన్స్ డామినేట్ చేసిందని అనిపించింది. పూజ హెగ్డే పాటు ఈ పాటలో చిందేసిన సౌబిన్ సాహిర్ గురించి మాట్లాడుకోవాలి. ఈ పాటలో ఆయన డ్యాన్స్ ఎనర్జీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. కొన్ని షాట్స్ లో ఫన్నీ మూవ్మెంట్స్ అదిరిపోయాయి. స్టైల్, గ్రేస్ కూడా ఉంది. ఇంతకీ ఈయన ఎవరూ అని ఆలోచిస్తున్నారా?, అయితే మరోసారి మంజుమ్మల్ బాయ్స్ సినిమా చూడాల్సిందే.
గత ఏడాది విడుదలైన ఈ మలయాళం సినిమా ఎవ్వరూ ఊహించని రీతిలో సంచలన విజయం సాధించింది. ఇందులో సౌబిన్ సాహిర్(Soubin Shahir) నటన అద్భుతంగా ఉంటుంది. ఈయన మలయాళం లో హీరో గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా,డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు పని చేశాడు. అన్ని చిత్రాలకు దాదాపుగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇతని లోని టాలెంట్ ని గమనించే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఏరికోరి ఈ చిత్రం లో ఒక అద్భుతమైన క్యారక్టర్ కోసం ఎంచుకున్నాడు. ఆయన క్యారక్టర్ సినిమాలో ఎలా ఉండబోతుందో ఈ లిరికల్ సాంగ్ చూసిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే సౌబిన్ సాహిర్ లో ఇంతటి డ్యాన్స్ టాలెంట్ దాగుందా అని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సౌబిన్ సాహిర్ మన తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడానికి కూలీ చిత్రమే సరైనది అనుకోవచ్చు.
Also Read: పూజ హెగ్డే డ్యాన్స్ కి ఈలలు వేసి చిందులు వేసిన త్రివిక్రమ్.. సంచలనం రేపుతున్న వీడియో!
మంజుమ్మల్ బాయ్స్ ద్వారా ఇప్పటికే కొంతమందికి సుపరిచితం అయ్యాడు కానీ , ఆశించిన స్థాయిలో మాత్రం కాదు. కూలీ చిత్రం హిట్ అయితే ఇటు తెలుగు లోనూ, అటు తమిళం లోనూ సౌబిన్ సాహిర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2’ కూడా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల్లో ఏది ఎక్కువ ఆదరణ దక్కించుకుంటుంది అనే దానిపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు ఇలా ఒకే తేదీన విడుదల అవ్వడం ఇప్పటి వరకు జరగలేదు. ప్రస్తుతానికి అయితే కూలీ చిత్రానికి ఉన్నంత క్రేజ్ వార్ 2 కి లేదు.
