https://oktelugu.com/

‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ను మిస్ కావొద్దు !

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కొడుకులు వదిలేస్తే వాళ్లు ఎంతగా ఇబ్బందులు పడతారో అనే అంశాల్ని ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ అద్భుతంగా చూపించాడు, అందుకే మిస్ కావొద్దు. ఇక ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25 అనే విభిన్నమైన టైటిల్ తో వచ్చిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయింది. పైగా ఈ చిత్రం దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తెలుగులోనూ ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ అనే టైటిల్ తో విడుదలై తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. Also Read: ‘మదగజ’ […]

Written By:
  • admin
  • , Updated On : October 13, 2020 / 12:59 PM IST
    Follow us on


    వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కొడుకులు వదిలేస్తే వాళ్లు ఎంతగా ఇబ్బందులు పడతారో అనే అంశాల్ని ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ అద్భుతంగా చూపించాడు, అందుకే మిస్ కావొద్దు. ఇక ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25 అనే విభిన్నమైన టైటిల్ తో వచ్చిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయింది. పైగా ఈ చిత్రం దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తెలుగులోనూ ‘ఆండ్రాయిడ్ కట్టప్ప’ అనే టైటిల్ తో విడుదలై తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది.

    Also Read: ‘మదగజ’ కోసం మైసూరులో జగపతి బాబు!

    ఈ చిత్రంలో కుంజప్పన్ పాత్రను నటుడు సూరజ్ అద్భుతంగా పోషించారు. ఈ చిత్రం కథ విషయానికి వస్తే..మలి వయసులోని తన తండ్రికి ఓ రోబో ను సాయంగా ఇచ్చి వెళ్తాడు కొడుకు. ఇక ఆ రోబోతో తండ్రి ఎలాంటి పాట్లు పడ్డాడు, తర్వాత దానితో ఎంతగా స్నేహం చేశాడు, ఇలా ఒక వృద్ధుడు – రోబోట్ మధ్య ఉన్న సంబంధం గురించి చాల ఎమోషనల్ గా చెబుతుంది ఈ సినిమా. సౌబిన్ కొడుకు సుబ్రహ్మణ్యం పాత్రను పోషించాడు. అలాగే కెండి జిర్డో- సైజు కురుప్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఇలా ఈ చిత్ర కథాంశం ఒక ఏజ్డ్ ఒంటరి వ్యక్తి చుట్టూ తిరుగుతూ చివర్లో ఆకట్టుకునే మెసేజ్ తో ఎండ్ అవుతోంది.

    Also Read: ఒక్క ట్వీట్ తో బాలీవుడ్ హీరోల పరువు తీసిన ఆర్జీవీ..!

    రతీష్ బాలకృష్ణన్ పోడువాల్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ-డ్రామా ఆంగ్ల చిత్రం రోబోట్ .. ఫ్రాంక్ స్ఫూర్తితో తెరకెక్కించారు. రష్యాలోని సెయింట్ పీటర్స్‌ బర్గ్‌లో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ సినిమాకు సాను వర్గీస్ చక్కని సినిమాటోగ్రఫీ అందించగా, బి.సి హరినారాయణన్ మరియు ఎ సి శ్రీహరి మధురమైన సాహిత్యం అందించారు. ఇక ఈ చిత్ర కథానాయిక కెండి జిర్డో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అమ్మాయి అయినప్పటికీ ఆమె పోషించిన పాత్ర మాత్రం చైనీస్ పాత్ర. చాల కొత్తగా ఉంది.