Relationship: మీ గర్ల్ ఫ్రెండ్/భార్య ఈ విషయాలను మీతో అసలు పంచుకోదు..

ప్రేమించిన వ్యక్తి దగ్గర క్రష్ గురించి చెప్పడానికి అమ్మాయికి అసలు ఇష్టం ఉండదు. ఇది మీ వద్ద దాచాలని కాదు, మోసం చేయాలని కాదు. కానీ వాటి వల్ల ప్రస్తుతం ఉన్న రిలేషన్ దెబ్బతింటుంది అనే భయంతోనే అలాంటి విషయాలను మీతో షేర్ చేసుకోరట అమ్మాయిలు.

Written By: Swathi Chilukuri, Updated On : April 8, 2024 4:37 pm

Relationship

Follow us on

Relationship: లవ్ రిలేషన్ లో ఉంటే చాలు చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలను షేర్ చేసుకుంటారు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలా చేశాను. అలా చేశాను. మా అమ్మ కొట్టింది నాన్న తిట్టాడు అంటూ ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకుంటారు. మరి రోజంతా మాట్లాడుకోవడానికి ఇంకా ఏం ఉంటాయి. ప్రజెంట్ మొత్తం వీరితోనే కాలక్షేపం. అందుకే పాస్ట్ లో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని పార్ట్ నర్ కు చెబుతుంటారు. కాలం గడిపేస్తుంటారు. కానీ అమ్మాయిలు కొన్ని విషయాలను మాత్రం అసలు షేర్ చేసుకోరు. అవేంటి అంటే..

క్రష్ గురించి.. ప్రేమించిన వ్యక్తి దగ్గర క్రష్ గురించి చెప్పడానికి అమ్మాయికి అసలు ఇష్టం ఉండదు. ఇది మీ వద్ద దాచాలని కాదు, మోసం చేయాలని కాదు. కానీ వాటి వల్ల ప్రస్తుతం ఉన్న రిలేషన్ దెబ్బతింటుంది అనే భయంతోనే అలాంటి విషయాలను మీతో షేర్ చేసుకోరట అమ్మాయిలు.

ఎక్స్ బాయ్ ఫ్రెండ్.. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో గడిపిన కొన్ని విషయాలు, వారికి సంబంధించిన విషయాలను పంచుకోరు. ఇలాంటి విషయాలను గోప్యంగా ఉంచడానికే ఇష్టపడతారు.

గర్ల్ గ్యాంగ్ చాట్.. కొన్ని సార్లు గర్ల్ ఫ్రెండ్స్ తో కూడా చాలా సేపు స్పెండ్ చేస్తారు. ఎక్కువ చాటింగ్ లో బిజీగా ఉంటారు. కానీ వారితో ఉన్న కొన్ని స్పెషల్ మూమెంట్స్, లేదా సీక్రెట్స్ ను మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరట.

లైంగిక చర్య.. లైంగిక చర్య గురించి, వాటికి సంబంధించిన ఎలాంటి విషయాలు అయినా భర్తతో గానీ, భాయ్ ఫ్రెండ్ తో గానీ చెప్పడానికి ఇష్టపడరు. వీటిని కూడా రహస్యంగానే ఉంచాలి అనుకుంటారు. కొన్ని సార్లు చులకన అవుతారని, మరికొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని లైంగిక పరంగా ఎలాంటి విషయాలను మాట్లాడడానికి ఇష్టపడరట అమ్మాయిలు.