https://oktelugu.com/

Kanta Rao: కాంతారావు 400 ఎకరాలు సంపాదించాడు కానీ ఏం లాభం…చివరి క్షణాలు అలా ముగిసిపోయాయి…

కత్తి యుద్ధాలు చేయడంలో కాంతారావుని మించిన వాళ్లు ఎవరు లేరు.అలా తన కత్తి సాహసాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఒకానొక టైంలో సినిమాలో కాంతారావు ఉన్నాడు ఇందులో కత్తి ఫైట్లు ఉన్నాయంటే జనాలు ఏగేసుకుంటూ థియేటర్ కి వచ్చి ఆయన సినిమాలు చూశారు. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ కళామతల్లికి రెండు కండ్ల లాంటి వాళ్ళు అయితే ఈయన నుదిటిన తిలకం లాంటివాడు అంటూ ఇప్పటికీ ఆయన ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సినీ మేధావులు సైతం ఆయన గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 13, 2024 / 04:48 PM IST

    Kanta Rao

    Follow us on

    Kanta Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ లను రెండు కండ్లు గా అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్లు ఇండస్ట్రీకి చేసిన సేవలు అలాంటివి. వాళ్ళు హీరోలుగా చాలా సినిమాలు చేసి చాలా మందికి ఉపాధి కూడా కల్పించారు. ఇక వీళ్ళు లేకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఇలా ఉండేది కాదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాగే తెలుగు సినిమా స్థాయిని ఇండియా వైడ్ గా చాటి చెప్పిన హీరోలు కూడా వీళ్లే కావడం విశేషం. వీళ్ళతో పాటుగా పోటీ పడి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు మరొకరు కూడా ఉన్నారు. ఆయన ఎవరు అంటే ‘కాంతారావు’…

    Also Read: అల్లుడూ! తిరిగి వచ్చేయ్ గ్రాండ్ గా పెళ్లి చేస్తా… రాజ్ తరుణ్ కి లావణ్య తండ్రి ఆఫర్, కేసులో కొత్త మలుపు

    కత్తి యుద్ధాలు చేయడంలో కాంతారావుని మించిన వాళ్లు ఎవరు లేరు.అలా తన కత్తి సాహసాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఒకానొక టైంలో సినిమాలో కాంతారావు ఉన్నాడు ఇందులో కత్తి ఫైట్లు ఉన్నాయంటే జనాలు ఏగేసుకుంటూ థియేటర్ కి వచ్చి ఆయన సినిమాలు చూశారు. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ కళామతల్లికి రెండు కండ్ల లాంటి వాళ్ళు అయితే ఈయన నుదిటిన తిలకం లాంటివాడు అంటూ ఇప్పటికీ ఆయన ప్రస్తావన వచ్చిన ప్రతిసారి సినీ మేధావులు సైతం ఆయన గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి నటులు కూడా కాంతారావుని ఎంకరేజ్ చేస్తూ ఆయన కూడా ఎక్కువ సినిమాలు చేయడానికి వాళ్లు కూడా ప్రోత్సాహాన్ని అందించారు. ఇక అప్పట్లో హీరోలందరూ చాలా సమిష్టిగా ఉండేవారు. ఏ సినిమా ఎవరు చేస్తున్నారో ఒకరి విషయాలను మరొకరు తెలుసుకొని వాళ్ళు ఎలాంటి సినిమాలు చేయాలి ఎలా అయితే ప్రేక్షకులను మెప్పించగలుగుతాం అంటూ ఒకరికొకరు చర్చించుకుంటూ మరి సినిమాలు చేసేవారు.

    అందువల్లే అప్పట్లో హీరోల మధ్య మంచి కమ్యూనికేషన్ అయితే ఉంది. కానీ ఆ తర్వాత వచ్చిన జనరేషన్ లో ఎవరి సినిమాలు వాళ్ళు చేస్తూ ఎవరి ఐడెంటిటీ కోసం వాళ్లే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు కాంతారావు సినిమాలు చేస్తున్న సమయంలో 400 ఎకరాల వరకు భూమిని అయితే సంపాదించారట. ఇక తన తదనంతరం సినిమా ఇండస్ట్రీలో నట వారసుడిగా ఎవరు లేకపోవడం కాంతారావు అభిమానులకు కొంతవరకు ఇబ్బందిని కలిగిస్తుంది. ఇక రీసెంట్ గా కాంతారావు కూతురు మీడియా ముందుకు వచ్చారు. ఒకప్పుడు వాళ్లకి చాలా భూములు ఉండేవని వాళ్ళ నాన్న చివరి క్షణానికి వచ్చేసరికి మాత్రం అవన్నీ పోగొట్టుకున్నామని వాళ్ళ నాన్న చనిపోయే సమయానికి వాళ్ల దగ్గర సంపాదన ఏమీ లేకపోవడం అనేది కొంతవరకు తీవ్ర విషాదాన్ని కలిగించిందంటూ ఆమె చెప్పుకొచ్చారు.

    అలాగే మా నాన్న చనిపోయేటప్పుడు కూడా మా అమ్మ ఎలా బతుకుతుంది. ఆమెని ఎవరూ చూసుకుంటారు అనే దిగులుతోనే చనిపోయాడు అంటూ ఆమె అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు… నిజానికి కాంతారావు మన తెలుగు సినిమా నటుడు కావడం తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఒకానొక సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ల తో పోటీపడి మరి ఆయన రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఆయన కోసం ప్రొడ్యూసర్లు క్యూ లు కట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇక ఇవన్నీ సాధించిన ఆయన చివరి క్షణంలో మాత్రం సంతోషం లేకుండా తన తనువు చాలించాడు అంటూ తన కూతురు చెప్పడం ఇప్పుడు అందరిని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది…ఇక తను చివరి రోజుల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు…

    Also Read: భారీ రేటు కు అమ్ముడు పోయిన పుష్ప 2 ఓటిటి రైట్స్…ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదుగా…