https://oktelugu.com/

Pushpa 2 OTT Rights: భారీ రేటు కు అమ్ముడు పోయిన పుష్ప 2 ఓటిటి రైట్స్…ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదుగా…

పుష్ప 2 ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించింది. అది ఏంటి అంటే ఈ సినిమా ఓటిటి రైట్స్ దాదాపు 250 కోట్లకు అమ్ముడు పోయాయని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఏ సినిమాకు లేనంత రేంజ్ లో ఈ సినిమా ఓటిటి రైట్స్ అనేవి అమ్ముడుపోవడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. అయితే పుష్ప 2 సినిమా మీద మొదటి నుంచి కూడా భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతూ వస్తుంది. దానివల్లే సినిమాకు వచ్చిన హైప్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఆ మార్కెట్ అనేది మరింత విస్తరిస్తూ పాన్ ఇండియాలో ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎదురుచూసేలా చేస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : July 13, 2024 / 03:03 PM IST

    Pushpa 2 OTT Rights

    Follow us on

    Pushpa 2 OTT Rights: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన నటుడు అల్లు అర్జున్… ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక పుష్ప సినిమాలో నటించినందుకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక దాంతో రెట్టింపు ఉత్సాహంతో పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా ముందుగా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు.

    కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. మరి ఎందుకు ఇలా చేశారు అనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పటికే పుష్ప 2 ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించింది. అది ఏంటి అంటే ఈ సినిమా ఓటిటి రైట్స్ దాదాపు 250 కోట్లకు అమ్ముడు పోయాయని వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఏ సినిమాకు లేనంత రేంజ్ లో ఈ సినిమా ఓటిటి రైట్స్ అనేవి అమ్ముడుపోవడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. అయితే పుష్ప 2 సినిమా మీద మొదటి నుంచి కూడా భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతూ వస్తుంది. దానివల్లే సినిమాకు వచ్చిన హైప్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఆ మార్కెట్ అనేది మరింత విస్తరిస్తూ పాన్ ఇండియాలో ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎదురుచూసేలా చేస్తుంది.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నారు. అందుకే పుష్ప 2 సినిమా మీద పాన్ ఇండియా మొత్తం భారీ హైప్ అయితే క్రియేట్ అయింది. మరి సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా మొదటి నుంచి కూడా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఈజీగా రాబడుతుంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేస్తున్నారు. దాదాపు ఈ సినిమా మీద 400 కోట్ల వరకు బడ్జెట్ అయితే పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొదటి పార్ట్ తో 400 కోట్ల కలెక్షన్లు రాబట్టిన అల్లు అర్జున్ ఈ సినిమా తో 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఈ సినిమాకి పాజిటివ్ టాక్ కనక వచ్చినట్టైతే సినిమా భారీ కలెక్షన్లను సాధిస్తుంది. లేకపోతే మాత్రం ఈ సినిమా కూడా మిగతా సినిమాల మాదిరిగానే చతికిలబడిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఎలాగైనా సరే ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలనే ఉద్దేశంతోనే దర్శకుడు సుకుమార్ మొదటి నుంచి కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టి మరి ఈ సినిమాను చేస్తున్నాడు. ఇక మధ్యలో ఆయనకేదైనా డౌట్ వచ్చినా కూడా దాన్ని ప్యాచ్ వర్క్ కింద మరొక రోజు ఎక్స్ట్రా షూట్ పెట్టి మరి దాన్ని ఫినిష్ చేసుకుంటూ వస్తున్నట్లుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ ఈ సినిమాని టాప్ లెవల్లో నిలబెట్టబోతున్నాడని వార్తలైతే వస్తున్నాయి. ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సుకుమార్ ఏ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు అనేది. ముఖ్యంగా ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే సీన్లతో మాత్రం ప్రేక్షకుడు చాలా హై ఫీల్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎంతైనా సుకుమార్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది.