https://oktelugu.com/

Assembly By Election Results: ఉప ఫలితాలు’: దేశంలో ఇండియా కూటమి హవా.. ఒక్కస్థానానికే ఎన్డీఏ పరిమితం.. బీజేపీ మేలుకోవాల్సిన టైం

పంజాబ్‌లోని జలంధర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్థానిక అధికార పార్టీ ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. 37,325 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్, హిమాచల్‌ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లోనూ ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 13, 2024 / 04:36 PM IST

    Assembly By Election Results

    Follow us on

    Assembly By Election Results: దేశవ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం ఇటీవల ఉప ఎన్నికలు నిర్వహించింది. వాటి ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇందులో ఇండియా కూటమి సత్తా చాటింది. దేశ వ్యాప్తంగా మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, 12 స్థానాల్లో ఇండియా కూటమి ముందంజల్లో ఉంది. కేవలం రెండు స్థానాల్లో మాత్రమే ఎన్డీఏ అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు.

    ఏడు రాష్ట్రాలు.. 13 స్థానాలు..
    దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లో మూడు, ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బిహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడులో ఒక్కో స్థానానికి ఎన్నికల సంఘం బై పోల్‌ నిర్వహించింది. ఇటీవల నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుపొందగా, మరికొన్ని చోట్ల సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరణించడంతో ఉప ఎన్నికలు నిర్వహించారు.

    ఇవి కూడా చదవండి: మోదీ ఆర్థిక కౌగిలిలో నాయుడు, నితీశ్‌… ఇరుక్కుపోయారా..?

    పంజాబ్‌లో ఆప్‌ విజయం..
    పంజాబ్‌లోని జలంధర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్థానిక అధికార పార్టీ ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. 37,325 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్, హిమాచల్‌ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లోనూ ఇండియా కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బెంగాల్‌లో నాలుగు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. 4 స్థానాల్లోనూ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక హిమాచల్‌ ప్రదేశ్‌లో 3 అసెంబ్లీ స్థానాల్లో, మధ్యప్రదేశ్‌లోని ఒక స్థానంలో, జార్ఖండ్‌లోని రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో ఒక స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించగా అక్కడ కూడా ఇండియా కూటమిలోని డీఎంకే అభ్యర్థి ముందందజలో కొనసాగుతున్నారు.

    ఒకే ఒక్క స్థానంలో ఇండియా కూటమి..
    ఒక్క బిహార్‌లో మాత్రమే ఎన్డీఏ కూటమిలోని జేడీయూ అభ్యర్థి స్వల్ప లీడ్‌లో ఉన్నారు. మిగతా అన్ని స్థానాల్లో ప్రస్తుతం ఎన్డీఏ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. దీంతో ఇండియా కూటమి పుంజుకుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ జోరు..
    ఇక హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌ జోరు కొనసాగుతోంది. దెహ్రా అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌సింగ్‌ భార్య కమలేష్‌ ఠాకూర్‌ పోటీ చేస్తున్నారు. ఆమె 8 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    కాంగ్రెస్‌ సంబరాలు..
    దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి అభ్యర్థులు గెలుపు బాటలో పయనిస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటన్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో ఈ ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

    తొలిసారి పోటీ..
    ఇదిలా ఉంటే.. హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ భార్య కమలేష్‌ ఠాకూర్‌తోపాటు మరికొంత మంది ఉప ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల బరిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఓడిపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది. కానీ నెల తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోవడం గమనార్హం.