Shekhar Kammula: ఇప్పటి వరకు ఒక్క స్టార్ హీరోతో కూడా సినిమా చేయలేదు…కానీ టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు..ఇంతకీ ఆయనెవరంటే..?

ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు వాళ్లకు నచ్చిన జానర్ లో సినిమాలను చేసి సక్సెస్ లు అందుకుంటారు. ఇక ఇక్కడ ఎలాంటి డైరెక్టర్ అయిన కూడా స్టార్ హీరోతో సినిమా చేసి స్టార్ డైరెక్టర్ గా ఎదగడమే లక్ష్యం గా పెట్టుకుంటారు...

Written By: Gopi, Updated On : August 2, 2024 5:46 pm

Shekhar Kammula

Follow us on

Shekhar Kammula: ఒక సినిమాని సక్సెస్ ఫుల్ గా తీయాలి అంటే ఆ దర్శకుడికి సినిమాల పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగే డైరెక్షన్ మీద అవగాహన ఉండాలి. కథ మీద పట్టు ఉండాలి. తను అనుకున్నది సక్సెస్ ఫుల్ గా చేయగలను అనే నమ్మకం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే దర్శకుడు రెండున్నర గంటలపాటు తను తీసిన సినిమాని ప్రేక్షకుడు చూసేలా చేసి సక్సెస్ లను అందుకుంటారు. మరి ఇలాంటి క్రమంలో చాలామంది దర్శకులు కమర్షియల్ డైరెక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ అవుతున్నారు. ఇక మరి కొంత మంది మాత్రం ఆర్ట్ ఫిలిమ్స్ ని తీసి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతుంటారు. ఇక ఇంకొంత మంది మాత్రం వాళ్ళ ఎంటైర్ కెరియర్ లో ఒక్క స్టార్ హీరోతో సినిమా చేయకపోయిన కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతుంటారు… ఇక ఈ కోవకి చెందిన వాడే శేఖర్ కమ్ముల.. ఆనంద్ సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన మొదటి నుంచి చాలా సక్సెస్ ఫుల్ సినిమాలను తీస్తూ వస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఆయన తీసిన ప్రతి సినిమా అటు యూత్ ను, ఇటు ఫ్యామిలీని ఇరు వర్గాల వారిని అలరిస్తూ ముందుకు దుసుకెళ్తున్నాయి. ఇక ఇప్పుడు ఆయన ధనుష్ ను హీరోగా పెట్టి ‘కుబేర ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నీ కూడా కొత్త వాళ్ళతోనో, లేదంటే మీడియం రేంజ్ హీరోలతో మాత్రమే చేశాడు. అయినప్పటికీ ఆ సినిమాలతో తను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కూడా గుర్తింపు పొందాడు.

ఇక ప్రస్తుతం ఆయన ధనుష్, నాగార్జున లను హీరోలుగా పెట్టుకొని కుబేర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం మొదటిసారిగా స్టార్ హీరో అయిన నాగార్జున తో వర్క్ చేస్తున్నాడు. కానీ తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు ఒక్క పెద్ద హీరోతో కూడా సినిమా చేయకుండా స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు అంటే నిజంగా ఆయనకు సినిమాల మీద ఉన్న పర్ఫెక్షన్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ఈ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ అందుకొని పాన్ ఇండియాలో కూడా స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే శేఖర్ కమ్ముల ఇప్పటివరకు 60% షూట్ ను కంప్లీట్ చేశారట. ఇక మిగతా 40% షూట్ ని కూడా తొందర్లోనే పూర్తి చేసి ఈ సినిమా వీలైనంత తొందరగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట.

ఇక మొత్తానికైతే ఈ సినిమాలో తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది… ఇక తను అనుకున్నట్టుగానే శేఖర్ కమ్ముల ఈ సినిమాతో పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటాడా? అలాగే ధనుష్ కి కూడా తెలుగులో మంచి మార్కెట్ ను క్రియేట్ చేయకోగలుగుతాడా? ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకి భారీ సక్సెస్ ను ఇవ్వగలుగుతాడా అనే చాలా ప్రశ్నలకు ఈ సినిమా సమాధానం చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది…