Monthly Income Scheme: ఈ ఒక్క డిపాజిట్ తో ప్రతి నెలా ఒకటో తారీఖు రూ.5000 బ్యాంకులో జమ అవుతాయి.. వెంటనే తెలుసుకోండి..

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పోస్టీపీసుల్లో బెస్ట్ సేవింగ్స్ పథకాలు ఉన్నాయి. ఇందులో అమ్మాయిల కోసం ‘సుకన్య సమృద్ధి పథకం’ ఉన్న విషయం తెలిసిందే. ఇందులో నెలకు కొంత మొత్తంగా పెట్టుబడి పెడితే 14, 21 సంవత్సాల్లో రిటర్న్స్ వస్తుంటాయి.

Written By: Chai Muchhata, Updated On : August 2, 2024 5:03 pm

Monthly Income Scheme

Follow us on

Monthly Income Scheme: డబ్బు సంపాదించాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ ఎలా సంపాదించాలన్నదే అసలైన ప్రశ్న. కొందరు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఎలాంటి దూబారా ఖర్చు చేయకుండా ఇంట్లోనీ బీరువాల్లో, బ్యాంకులో డబ్బును దాచుకుంటారు. ఆ డబ్బుతో ఎలాంటి పెట్టుబుడులు పెట్టరు. దీంతో ఆ డబ్బు అలాగే ఉండిపోతుంది. ఒక్క రూపాయి కూడా పెరగదు. అయితే ప్రణాళిక ప్రకారం కొన్ని మార్గాల్లో డబ్బును ఇన్వెస్ట్ మెంట్ చేయడం వల్ల డబ్బుపై వడ్డీ వస్తుంది. కొన్ని సంవత్సరాల పాటు ఆగితే రెట్టింపు అవుతుంది. అయితే కొందరు చిట్టీలు, ఇతర సేవింగ్స్ చేస్తూ ఉంటారు. కానీ ఈమధ్య చిట్ ఫండ్స్ మోసాలు ఉండడం వల్ల వీటికి దూరంగా ఉండడమే మంచిదని కొందరి అభిప్రాయం. ఇక కొంత మంది వద్ద డబ్బు ఉంటుంది. కానీ వారికి నెలనెలా ఖర్చులు ఉంటాయి. దీంతో ఆ దాచుకున్న డబ్బలో నుంచి ప్రతీ నెల కొంత ఖర్చు చేయడం వల్ల మూలధనం తగ్గిపోతుంది. అయితే ఇలాంటి సమయంలో డబ్బును ఇంట్లో ఉంచుకోకుండా పథకాల్లో ఇన్వెస్ట్ మెంట్ చేయడం వల్ల నెలనెలా ఖర్చులకు డబ్బులు అందుతాయి. ఆ తరువాత కొన్నేళ్ల పాటు ఆ డబ్బు అలాగే ఉంటుంది. అంతేకాకుండా ఇది సెక్యూరిటీగా ఉన్నట్లుంటుంది. అందువల్ల పెద్ద మొత్తంలో డబ్బు ఉన్న వారు ఇంట్లోనే ఉంచుకోకుండా, బ్యాంకులో సాధారణ డిపాజిట్ చేయకుండా ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ మెంట్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటిలో పోస్టాఫీసుకు సంబంధించి ఓ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల నెలనెల రూ. 5000లకు పైగా జమ అవుతాయి. మరి ఆ స్కీం ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి..

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పోస్టీపీసుల్లో బెస్ట్ సేవింగ్స్ పథకాలు ఉన్నాయి. ఇందులో అమ్మాయిల కోసం ‘సుకన్య సమృద్ధి పథకం’ ఉన్న విషయం తెలిసిందే. ఇందులో నెలకు కొంత మొత్తంగా పెట్టుబడి పెడితే 14, 21 సంవత్సాల్లో రిటర్న్స్ వస్తుంటాయి. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు ఉన్నాయి. ఈ విధంగానే నెలనెలా వడ్డీ చెల్లించే ఓ పథకం ఉంది. అదే Monthly Income Scheme.

సాధారణంగా బ్యాంకులో, పోస్టాఫీసుల్లో పిక్స్ డ్ డిపాజిట్ చేస్తే గడువు తీరిన తరువాత అసలు, వడ్డీ కలిపి ఒకేసారి చెల్లిస్తారు. కానీ ‘మంథ్లీ ఇన్ కం స్కీం’లో పెట్టుబడి పెట్టడం వల్ల నెలనెలా వడ్డీని పొందవచ్చు. చివరలో ఎంత ఇన్వెస్ట్ మెంట్ చేస్తారో? ఆ మొత్తం అలాగే ఉంటుంది. ఉదాహరణకు రూ. 9 లక్షలను 2 సంవత్సరాలకు ఇన్వెస్ట్ మెంట్ చేశామనుకోండి. వీటి మీద 7.1 శాతం వడ్డీరేటును అందిస్తున్నారు. అంటే రూ.9 లక్షలకు రూ. 5000కు పైగా నెలనెలా ఆదాయం పొందుతారు.

అయితే ఈ రూ.9 లక్షలు ఒక్కసారి డిపాజిట్ చేస్తే మధ్యలో విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. అయితే ఫస్ట్ ఇయర్ తరువాత 40 శాతం విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే నెలనెల నిర్ణయించిన తేదీకి వడ్డీ బ్యాంకులో జమ అవుతూ ఉంటుంది. బ్యాంకులో సాధారణ డిపాజిట్ కంటే ఇలా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది.పైగా నెలనెలా అవసరాలు లేదా ఈఎంఐ ఉంటే ఈ ఆదాయంతో తీర్చ వచ్చు. లేదా ఇంట్లో ఖర్చులకు ఉపయోగించుకోవడం వల్ల మిగతా డబ్బు సేవ్ అవుతుంది. అందువల్ల పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే పోస్టాఫీసుకు చెందిన Monthly Income Scheme లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.