Vastu Tips
Vastu Tips: ప్రకృతి మనుషులతో మమేకమై ఉంటుంది. ప్రకృతిలో లభించే వస్తువులు మనుషుల జీవితంలో భాగమై ఉంటాయి. వీటిలో చెట్లు ప్రధానమైనవి. చెట్లు లేకపోవడం వల్ల మనుషులకు స్వచ్ఛమైన గాలి దొరకదు. చెట్లు ఉన్న చోటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అయితే అభివృద్ధి జరుగుతున్న క్రమంలో కొన్ని చెట్లు నేటమట్టమవుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో భవనాలు నిర్మించడానికి ప్రదేశం కోసం చెట్లను నరికేస్తున్నారు. ఇక్కడ ఎటు చూసిన భవనాలు, రోడ్డు మాత్రమే కనిపిస్తున్నాయి. చెట్టు కనిపించడం లేదు. ఈ తరుణంలో కొందరు ప్రశాంతత కోసం ఇంట్లోనే కొన్ని చెట్లు పెంచుకుంటున్నారు. సిటీల్లో అనువైన ప్రదేశం ఉండదు. అందువల్ల కొన్ని మొక్కలను ఇంటికి తెచ్చుకుంటున్నారు. కొందరు కుండీలు ఏర్పాటు చేసుకొని మొక్కలు పెంచుతున్నారు. మరికొందరు బంగాపై చిన్న పాటి నర్సరీని ఏర్పాటు చేస్తున్నారు. చెట్లు ఇచ్చే స్వచ్ఛమైన వాతావరణాన్ని ఇంకేవి ఇవ్వవు. కొందరు మొక్కలను పెంచడం హాబీగా ఏర్పాటు చేసుకొని అందమైన మొక్కలను ఇంటి వద్ద పెంచుకుంటున్నారు. అటు గ్రామాల్లో సైతం వివిధ కార్యక్రమాల నేపథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతోంది. అయితే చెట్లు పెంచాలని ఎంత ఇష్టంగా ఉన్నా కొన్ని చెట్లకు దూరంగా ఉండాలని వాస్తు శాస్త్రం తెలుపుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లో పెంచుకోవడం ద్వారా కష్టాలు ఉంటాయని తెలుస్తోంది. మరికొన్ని చెట్లు ఇంటి దరిదాపుల్లో ఉన్నా నష్టమే అంటున్నారు. ఆ మొక్కలు, చెట్లు ఏవో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాలు మీకోసమే..
చింత పండు గురించి కిచెన్ మాస్టర్ ను ఎవరిని అడిగినా చెబుతారు. కొన్ని కూరల్లో చింతపండు ప్రధానంగా ఉంటుంది. చింతపండుతో చారు కూడా చేస్తారు. అయితే ఈ చింతపండు లభించే చింత చెట్టు ఇంటి దరిదాపుల్లో ఉండరాదని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. చింత చెట్టు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే ఈ చెట్టు ఉన్న ఇంట్లో వాళ్లు అనారోగ్యంతో ఉంటారు.
పంట సాగులో ఉన్న పత్తి మొక్క ఇంట్లో పెంచుకోరాదు. అలాగే సిల్క్, మల్బరీ, కాటన్ చెట్లు కూడా ఇంట్లో పెంచుకోరాదు. ఇవి ఇంట్లో ఉండడం వల్ల అశుభాలే ఎక్కువగా జరుగుతాయి. అంతేకాకుండా నిత్యం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఏదో ఒక అవసరానికి డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు వస్తాయి.
పట్టణాలు, నగరాల్లో అనువైన ప్రదేశం ఉండదు. దీంతో ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుకుంటారు. అయితే బోన్సాయ్ అనే మొక్కలు చూడ్డానికి అందంగా కనిపిస్తాయి. కానీ వీటిని ఇంట్లో పెంచుకోరకాదు. ఇవి ఇంటిలోపల ఉంటే వ్యక్తిగత జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.
కాక్టస్ అనే మొక్క గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనిని ఇంట్లో పెంచుకోవడం వల్ల శత్రువులు పెరుగుతాయి. దీనికి ఉండే ముళ్లు కారణంగా ఇంట్లో ప్రతి ఒక్కరి మనసు ఆందోళనగా ఉంటుంది. ఇవి ఇంట్లో ఉండడవ వల్ల నిత్యం ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుంది.
మదరంగి మొక్క కు దూరంగా ఉండడం మంచింది. దీనిని ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇంట్లో వాళ్ల మధ్య ఎప్పుడు అపార్థాలు ఏర్పడుతాయి. నిత్యం వాదనలు చేసుకుంటూ ఉంటారు. ఈ మొక్కలు నివసించే ప్రాంతాలకు దూరంగా ఉంచడం మంచిది.
ఇంట్లో గానీ, ఇంటి ఆవరణలో గానీ పటిక చెట్లు లేకుండా చూడడం మంచిది. ఇది ఇంట్లో పెంచుకోవడం వల్ల నిత్యం గొడవలు ఉంటాయని వాస్తు శాస్త్రం తెలుపుతుంది. ఏదో ఒక సమస్యతో ఇంట్లో ఆందోళన వాతావరణం ఉంటుంది. అందువల్ల ఈ చెట్టు జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
View Author's Full InfoWeb Title: Dont grow these plants even by mistake otherwise there will be fights and conflicts do you know what those plants are