Ramoji Rao Passed Away: రామోజీ రావు మరణం పట్ల సంతాపాన్ని తెలియజేసిన చిరంజీవి ఎన్టీయార్…

జూనియర్ ఎన్టీఆర్ కూడా రామోజీరావు మరణం పట్ల తమ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక 'నిన్ను చూడాలని' సినిమాతో తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత రామోజీరావు గారు మన మధ్య లేరు అనేది చాలా బాధాకరమైన విషయం అంటూ ఎన్టీఆర్ తన బాధ ను తెలియజేశాడు.

Written By: Gopi, Updated On : June 8, 2024 10:08 am

Ramoji Rao Passed Away

Follow us on

Ramoji Rao Passed Away: ఈనాడు పేపర్ అధినేత, ఈటీవీ ఛానెల్ సృష్టికర్త, ప్రముఖ నిర్మాత రామోజీరావు గారు ఈరోజు ఉదయం తన తుది శ్వాసను విడవడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీని తీవ్రమైన దిగ్భ్రాంతి గురిచేస్తుంది. ముఖ్యంగా లెజెండరీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రామోజీరావు ఇప్పుడు ఇలా అందరిని వదిలేసి వెళ్లడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి…

ఇక ఆయన మరణం పట్ల చిరంజీవి తన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా “ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివి కెగిసింది”అంటూ ఒక ఎమోషనల్ ట్వీట్ అయితే చేశాడు. ఇక ఆయన లేని లోటును ఎవరు తీర్చలేరు అంటూ కూడా చిరంజీవి పోస్ట్ పెట్టడం అనేది ఇప్పుడు యావత్ తెలుగు సినిమా అభిమానులందరి హృదయాలను కలచివేస్తుంది…నిజానికి చిరంజీవి కి రామోజీరావు గారికి మధ్య మొదటి నుంచి కూడా మంచి సన్నిహిత్యం అయితే ఉంది…

ఇక ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా రామోజీరావు మరణం పట్ల తమ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక ‘నిన్ను చూడాలని’ సినిమాతో తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత రామోజీరావు గారు మన మధ్య లేరు అనేది చాలా బాధాకరమైన విషయం అంటూ ఎన్టీఆర్ తన బాధ ను తెలియజేశాడు…

నిజానికి ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ స్థాయి లో ఉన్నారంటే దానికి ఒక రకంగా రామోజీరావు కారణం అనే చెప్పాలి. అయితే సీనియర్ ఎన్టీఆర్ కి రామోజీరావు కి మధ్య మంచి అనుబంధం ఉండేది. అందుకే జూనియర్ ఎన్టీయార్ ను పరిచయం చేసి సీనియర్ ఎన్టీయార్ మీద ఉన్న ఇష్టాన్ని ఈ రకంగా ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక అలాంటి ఒక పెద్ద మనిషి ఇండస్ట్రీలో ఇకమీదట లేరని చెప్పడానికి కూడా మన మాట తడబడుతుంది అంటే ఆయన ఎలాంటి గొప్ప వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక ఆయన తన కెరియర్ ను జీరో తో స్టార్ట్ చేసి ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలవడం అనేది నిజంగా ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ విషయం అనే చెప్పాలి…