Kalki 2898 AD: కల్కి సినిమాకు నార్త్ ఇండియాలో రెస్పాన్స్ ఎలా ఉందంటే?

రాజస్థాన్ లో టోంక్ టౌన్ లో డబ్బింగ్ సినిమాలకి 20 శాతం ఆక్యుపెన్సీ వస్తే చాలుసినిమా హట్ అన్నట్టుగా భావిస్తారు. అలాంటిది కల్కి 2898ఏడీ చిత్రానికి ఏకంగా 77% ఆక్యుపెన్సీ వచ్చిందట. అంటే ఈ సినిమా ఫీవర్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Written By: Swathi, Updated On : June 29, 2024 3:25 pm

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: ఎఫ్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ మూవీ కల్కి 2898ఏడీ సినిమా జూన్ 27న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. ప్రపంచ వ్యాప్తంగా 8500 స్క్రీన్స్ లో కల్కి మూవీ విడుదల అయింది. ఎంతో మంది సినిమాను కొనియాడుతున్నారు. ఇండియన్ మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి తెరపై నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాడని ప్రభాస్ అభిమానులు విజిల్స్ వేస్తున్నారు. మరి నార్త్ వారికి ఈ సినిమా ఎలా అనిపించిందో తెలుసా?

ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ ప్రాంతాల్లో ప్రభాస్ కు ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కూడా. ఇక నార్త్ ఇండియాలో సెంట్రల్ స్టేట్స్, సిటీల వరకు మాత్రమే తెలుగు సినిమా లు ఆడియన్స్ ను ఆకట్టుకునేవి. అయితే ఇప్పుడు రాజస్థాన్ లాంటి రాష్ట్రాలలో చిన్న చిన్న టౌన్స్ లకి కూడా కల్కి మూవీ రీచ్ అయ్యింది అంటే ప్రభాస్ రేంజ్ ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

రాజస్థాన్ లో టోంక్ టౌన్ లో డబ్బింగ్ సినిమాలకి 20 శాతం ఆక్యుపెన్సీ వస్తే చాలుసినిమా హట్ అన్నట్టుగా భావిస్తారు. అలాంటిది కల్కి 2898ఏడీ చిత్రానికి ఏకంగా 77% ఆక్యుపెన్సీ వచ్చిందట. అంటే ఈ సినిమా ఫీవర్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయలేదు టీమ్. ప్రభాస్ స్టార్ ఇమేజ్, కల్కి మూవీ కంటెంట్ వల్ల సినిమాకు హైప్ వచ్చిందంటూ టాక్. ప్రేక్షకులని ఎంగేజ్ చేసే ఎలిమెంట్స్ ను నాగ్ అశ్విన్ అద్భుతంగా అద్భుతంగా తెరకెక్కించారని కామెంట్లు వస్తున్నాయి.

మల్టీప్లెక్స్ లో కూడా సినిమాకు విజిల్స్ రావడం గ్రేట్ అంటున్నారు కొందరు.ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను మాత్రమే కాదు కచ్చితంగా భారీ కలెక్షన్లను కలెక్ట్ చేస్తుందనే టాక్ వస్తుంది అంటున్నారు విశ్లేషకులు. హై రేంజ్ లో ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.