https://oktelugu.com/

Krithi Shetty: ప్రేమలో పడిన కృతి శెట్టి… తన లవర్ ఎవరో తెలుసా?

కృతి శెట్టి రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్ సైతం సూపర్ హిట్ కొట్టింది. నానికి జంటగా గ్లామరస్ రోల్ లో అలరించింది అమ్మడు. ఇక మూడో చిత్రం బంగార్రాజుతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు హిట్ టాక్ తెచ్చుకుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : June 5, 2024 / 10:18 AM IST

    Krithi Shetty

    Follow us on

    Krithi Shetty: హీరోయిన్ కృతి శెట్టి ప్రేమలో ఉన్నట్లు ఓపెన్ అయ్యింది. ఆమె రిలేషన్ లో ఉంది ఎవరితోనో కూడా వెల్లడించింది. ఆ ఆసక్తికర సంగతులు ఏమిటో చూద్దాం. కృతి శెట్టి ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. 2021లో విడుదలైన ఉప్పెన బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. వంద కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటింది. కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. కృతి శెట్టి గ్లామర్ మెస్మరైజ్ చేసింది. ఉప్పెన సక్సెస్ నేపథ్యంలో కృతి శెట్టికి వరుస ఆఫర్స్ వెల్లువెత్తాయి.

    కృతి శెట్టి రెండో చిత్రం శ్యామ్ సింగరాయ్ సైతం సూపర్ హిట్ కొట్టింది. నానికి జంటగా గ్లామరస్ రోల్ లో అలరించింది అమ్మడు. ఇక మూడో చిత్రం బంగార్రాజుతో హ్యాట్రిక్ పూర్తి చేసింది. 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు హిట్ టాక్ తెచ్చుకుంది. వరుస విజయాలతో లక్కీ హీరోయిన్ ట్యాగ్ సొంతం చేసుకున్న కృతి శెట్టికి బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డాయి. ఆమె హీరోయిన్ గా నటించిన వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

    తెలుగులో ఆమెకు ఒక్కసారిగా ఆఫర్స్ తగ్గాయి. ప్రస్తుతం శర్వానంద్ కి జంటగా మనమే టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేస్తుంది. మనమే జూన్ 7న విడుదల కానుంది. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. కాగా మీరు రిలేషన్ లో ఉన్నారా? అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. ఈ ప్రశ్నకు అవునని కృతి శెట్టి సమాధానం చెప్పి షాక్ కి గురి చేసింది. నేను రిలేషన్ లో ఉన్నాను. అది ఎవరితో అంటే నా ప్రొఫెషన్ తో. నా వర్క్ తో నేను రిలేషన్ లో ఉన్నానని కొంటె సమాధానం చెప్పింది.

    ప్రస్తుతానికి నా దృష్టి కేవలం కెరీర్ మీదే. ఎలాంటి రిలేషన్స్ పెట్టుకునే ఆలోచన లేదని కృతి శెట్టి చెప్పకనే చెప్పింది. కృతి శెట్టి-శర్వానంద్ కి మనమే విజయం చాలా అవసరం. శర్వానంద్ కూడా హిట్ కొట్టి చాల రోజులు అవుతుంది. శర్వానంద్ సైతం చాలా ఆశలే పెట్టుకున్నాడు శర్వానంద్. మనమే చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.