Honey Rose: చిన్నప్పుడు హనీ రోజ్ ఇలా ఉండేదా? గుర్తు పట్టాలంటూ ఛాలెంజ్ విసిరిన హాట్ బ్యూటీ! వైరల్ పిక్

నిజానికి హనీ రోజ్ చాలా ఏళ్ల క్రితమే తెలుగులో అడుగుపెట్టింది. ఈ మలయాళ భామ ఆలయం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఈ చిత్ర హీరో బిగ్ బాస్ శివాజీ.

Written By: S Reddy, Updated On : March 14, 2024 2:33 pm

Honey Rose school photo goes viral

Follow us on

Honey Rose: హీరోయిన్ హనీ రోజ్ ఒక్క మూవీతో పాప్యులర్ అయ్యింది. 2023 సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహారెడ్డి చిత్రంలో హనీ రోజ్ రెండు భిన్నమైన పాత్రలు చేసింది. బాలకృష్ణకు భార్యగా, తల్లిగా ఆమె నటించారు. ‘మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయే’ సాంగ్ లో తన గ్లామర్ తో ఆకట్టుకుంది. వీర సింహారెడ్డి సూపర్ హిట్ అయింది. అనంతరం హనీ రోజ్ కి టాలీవుడ్ లో ఆఫర్స్ పెరుగుతాయి అనుకుంటే అలా జరగలేదు. వీర సింహారెడ్డి విడుదలై ఏడాది దాటిపోతున్నా తెలుగులో హనీ రోజ్ మరో చిత్రం చేయలేదు.

నిజానికి హనీ రోజ్ చాలా ఏళ్ల క్రితమే తెలుగులో అడుగుపెట్టింది. ఈ మలయాళ భామ ఆలయం చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఈ చిత్ర హీరో బిగ్ బాస్ శివాజీ. ఆలయం మూవీ అంతగా ఆడలేదు. అనంతరం 2014లో వరుణ్ తేజ్ కి జంటగా ఈ వర్షం సాక్షిగా చిత్రంలో నటించింది. అది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత వీర సింహారెడ్డితో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

తాజాగా హనీ రోజ్ తన చైల్డ్ హుడ్ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్కూల్ లో చదువుకునే రోజుల్లో చిన్న పాపగా ఉన్న ఫోటో పోస్ట్ చేసింది. తన టీచర్స్, తోటి స్టూడెంట్స్ తో కలిసి దిగిన గ్రూప్ ఫోటో పోస్ట్ చేసిన హనీ రోజ్ తాను ఎవరో గుర్తించాలని ఛాలెంజ్ విసిరింది. నిజానికి అంత మందిలో చిన్నప్పటి హనీ రోజ్ ని గుర్తించడం కష్టమే. అందుకే ఆమె ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. నిజానికి ఇది కష్టతరమైన వ్యవహారమే. అదేదో నువ్వే చెప్పేస్తే బాగుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఇక సోషల్ మీడియాలో హనీ రోజ్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మిలియన్స్ లో ఆమెను ఫాలో అవుతున్నారు. ఆమె తరచుగా గ్లామరస్ ఫోటోలు, చేస్తూ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది. హనీ రోజ్ కి ఇంకా వివాహం కాలేదు. పెళ్లిపై ఆమె భిన్నమైన ఆలోచన విధానం కలిగి ఉంది. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెబుతుంది. ఆమె వివాహం చేసుకుంటే బాధపడే కుర్రాళ్ళు ఎందరో. ఇక తెలుగు ఆడియన్స్ ఆమె ఓ చిత్రం చేస్తే చూడాలని ఆశపడుతున్నారు.