Honey Rose: అప్పుడు బాలయ్య.. ఇప్పుడు చిరంజీవి.. హనీ రోజ్ పంట పండినట్టేనా?

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. డ్యూయల్ రోల్ లో నటించి బాలయ్య మెప్పించారు. ఇందులో నటించి మలయాళ బ్యూటీ హనీ కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది.

Written By: Swathi, Updated On : January 29, 2024 4:07 pm
Follow us on

Honey Rose: బాలయ్య సినిమా వస్తుందంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఆ సినిమాలో కొత్త హీరోయిన్ ను తీసుకున్న, పాత హీరోయిన్ ఉన్నా కూడా వారి క్రేజ్ మామూలుగా ఉండదు. కొత్త హీరోయిన్ అయితే కచ్చితంగా ఫేమస్ అవుతుంటుంది. అదే విధంగా రీసెంట్ గా వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. అందులో నటించిన హనీ రోజ్ కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించింది.అంతేకాదు ఒక్కసారిగా ఈ అమ్మడు క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. డ్యూయల్ రోల్ లో నటించి బాలయ్య మెప్పించారు. ఇందులో నటించి మలయాళ బ్యూటీ హనీ కూడా తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయం అయినా హనీ మరో తెలుగు సినిమాలో నటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ఫాలోయింగ్ సంపాదిస్తూ ఎప్పుడు యాక్టివ్ గా ఉండేది. ఇప్పటికీ కూడా నిత్యం షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తో బిజీ బిజీ గడిపేస్తుంటుంది హనీరోజ్.

హనీ రోజ్ నటించిన సినిమాలు కొన్నే అయినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఫుల్ గా ఉంది. ఈ అమ్మడుకు ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 4 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే హనీ ఓ టాలీవుడ్ సినిమాలో నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మరోసారి కూడా సీనియర్ హీరోతోనే జతకట్టనుందని తెలుస్తోంది. అంటే గతంలో బాలయ్యతో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం చిరంజీవితో నటించడానికి సిద్దమైందన్నమాట. ఇక చిరంజీవి నటిస్తున్న న్యూ సినిమా విశ్వంభర.

విశ్వంభర సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. విశిష్ట చిరంజీవి సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించబోతున్నారట. ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మొత్తం మీద మంచి అంచనాల నడుమ రాబోతున్న ఈ చిరు సినిమాలో హనీ రోజ్ ఛాన్స్ కొట్టేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజంగానే హనీ ఈ సినిమాలో నటించబోతుందా లేదా అనేది తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.