డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్, అండ్ ‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా ఆద్భుతంగానే ఉంటుంది. ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ ఎన్నో విశేషాలను తనదైన శైలిలో ఆసక్తికరంగా చెప్పుకొస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా పూరి నుండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చింది. టాపిక్ పేరు ‘సింగిల్ బై ఛాయిస్’. ‘సినిమా హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకుని సాధారణ మహిళలు లాగే లైఫ్ లీడ్ చేస్తే నాకు నచ్చదు. కోటి మందిలో ఒకరికి హీరోయిన్ గా సక్సెస్ అయ్యే అవకాశం వస్తోంది. అందుకే, వాళ్లు నాకు ఎంతో స్పెషల్. ఫ్యాన్స్ కూడా హీరోయిన్స్ ని తమ దేవతల్లా ఫీల్ అవుతూ ఉంటారు.
మరి అలాంటి దేవతలు కూడా పురిటి నొప్పులు పడుతుంటే నేను సహించలేను. మనం పూజించే నిజమైన దేవతలు కూడా పిల్లల్ని కనలేదు. అసలు పిల్లల్ని కనాలనే కోరిక తాపత్రయం మనుషులకు ఉంటుంది గానీ, దేవతలకు ఉండదు. కాబట్టి, హీరోయిన్స్ అందరికీ చెబుతున్నాను, మీరు పెళ్లిళ్లు చేసుకోకుండా దేవతల్లా ఉంటే మేము ఎంతో ఆనందిస్తాం. ఇక సాధారణ అమ్మాయిలతో పోల్చుకుంటే మీరు పర్సనల్ గా ఎంతో స్ట్రాంగ్ గా ఉంటారు.
ఏ.. మీరు ప్రేమ లేకపోతే చచ్చిపోతారా? ‘జయలలిత, మాయావతి, మమతాబెనర్జీ.. ఇలా ఎంతోమంది మహిళలు స్ఫూర్తి నింపడానికి మన సమాజంలో ఉన్నారు. వాళ్లకు మగవాళ్లతో పనిలేదు. వాళ్ళు ఎంతో సాధించారు కూడా, అలాగే పురాణాల్లో కూడా సింగిల్ ఉమెన్స్ ఎంతోమంది ఉన్నారు. అసలు రంభ ఊర్వశి, మేనకలు పెళ్లి చేసుకోలేదు కాబట్టే, వాళ్ళ పై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
హీరోయిన్స్ అందరూ నా మాట విని దేవతల్లా ఆలోచించండి. మీ శక్తిని మరో విధంగా వాడండి. ధైర్యవంతురాలైన ప్రతి మహిళా దేవతలా మారాలి. స్ట్రాంగ్ ఉమెన్ మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరు’ అని పూరి చెప్పుకొచ్చాడు.