https://oktelugu.com/

జగన్ ప్రభుత్వంలో శ్రీలక్ష్మికి కీలక పదవి?

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సంబంధించి ఆంధ్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో రెండు ప్రమోషన్లు నిబంధనల ప్రకారం రెగ్యులర్ పదోన్నతులుగానే గుర్తించింది. ఆమెపై పెండింగులో ఉన్నకోర్టు కేసుల్లో వెలువడే నిర్ణయాన్ని బట్టి పదోన్నతి కొనసాగింపు ఉంటుందని ప్రమోషన్ సమయంలో ప్రభుత్వం పేర్కొంది. తిరిగి మార్చిలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది. ఇప్పుడు రెండు రెగ్యులర్ ప్రమోషన్లుగా ప్రభుత్వం గుర్తిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అయిన తరువాత తెలంగాణ కేడర్ […]

Written By: , Updated On : June 17, 2021 / 05:27 PM IST
Follow us on

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సంబంధించి ఆంధ్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో రెండు ప్రమోషన్లు నిబంధనల ప్రకారం రెగ్యులర్ పదోన్నతులుగానే గుర్తించింది. ఆమెపై పెండింగులో ఉన్నకోర్టు కేసుల్లో వెలువడే నిర్ణయాన్ని బట్టి పదోన్నతి కొనసాగింపు ఉంటుందని ప్రమోషన్ సమయంలో ప్రభుత్వం పేర్కొంది. తిరిగి మార్చిలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది. ఇప్పుడు రెండు రెగ్యులర్ ప్రమోషన్లుగా ప్రభుత్వం గుర్తిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అయిన తరువాత తెలంగాణ కేడర్ లో ఉన్న శ్రీలక్ష్మిని ఏపీకి తీసుకొచ్చేందుకు జగన్ కష్టపడాల్సి వచ్చింది. తొలుత సరైన కారణాలు లేవని ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ సాధ్యం కాదని డీవోపీటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం జగన్ నేరుగా ప్రధాని వద్దకు ఈ అంశాన్ని తీసుకెళ్లి శ్రీలక్ష్మికి తన ప్రభుత్వంలో పనిచేసే అవకాశం కల్పించారు. శ్రీలక్ష్మి వరుసగా రెండు ప్రమోషన్లు దక్కించుకుని ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నారు.

వైఎస్సార్ హయాంలో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. జగన్ పైన నమోదైన సీబీఐ కేసుల్లో భాగంగా ఓబులాపురం మైనింగ్ కేసులో నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మి పైన అభియోగాలు నమోదయ్యాయి. చాలా రోజులు శ్రీలక్ష్మి జైలులో ఉండాల్సి వచ్చింది. క్యాప్టిన్ మైనింగ్ లో ఉద్దేశపూర్వకంగా శ్రీలక్ష్మి జీవోలో కొందరికి అనుకూలంగా వ్యవహరించారనేది నాటి అభియోగం. జైలులో ఉన్నసమయంలో శ్రీలక్ష్మి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆ తరువాత విడుదలైన శ్రీలక్ష్మికి తెలంగాణ ప్రభుత్వంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే జగన్ సీఎం అయిన తరువాత తన పైన రాజకీయంగా పెట్టిన కేసుల్లో శ్రీలక్ష్మి సైతం ఇబ్బందులు పడాల్సి వచ్చిందనే భావనతో తన ప్రభుత్వంలో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

నాడు తెలంగాణ ముఖ్యమంత్రికి స్వయంగా శ్రీలక్ష్మి విషయాన్ని జగన్ నివేదించగా ఆయన వెంటనే స్పందించారు. కానీకేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు శ్రీలక్ష్మికి అధికారికంగా ఏపీ కేడర్ కు బదిలీ జరగాల్సిఉంది. శ్రీలక్ష్మికి రానున్న రోజుల్లో ప్రభుత్వంలో కీలక పదవి దక్కబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ 1987 బ్యాచ్ అధికారిక పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాశారు.