
Simran : స్టార్ హీరోయిన్ గా సిమ్రాన్ సౌత్ ఇండియాను ఏలారు. అయితే ఆమె జీవితంలో ఓ విషాదం ఉంది. సిమ్రాన్ చెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో ఇది పెద్ద న్యూస్ అయ్యింది. అక్క నట వారసత్వం తీసుకుని సిమ్రాన్ చెల్లెలు మోనాల్ నావల్ పరిశ్రమలో అడుగుపెట్టారు. మోనాల్ మొదటి చిత్రం ఇంద్రధనుష్. 2000లో విడుదలైన ఈ కన్నడ చిత్రంలో శివరాజ్ కుమార్ హీరో. విజయ్ కి జంటగా ఆమె నటించిన తమిళ మూవీ బద్రి సూపర్ హిట్ కొట్టింది. హీరోయిన్ గా ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్న రోజుల్లో మోనాల్ అనూహ్యంగా తనువు చాలించారు.
2002 ఏప్రిల్ 14న మోనాల్ చెన్నైలోని తన నివాసంలో ఉరివేసుకున్నారు. అప్పటికి మోనాల్ వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. అక్క సిమ్రాన్ ని ఈ సంఘటన తీవ్ర వేదనకు గురి చేసింది. సిమ్రాన్ తన చెల్లి మరణానికి కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజిత్ కారణమని ఆరోపించారు. మోనాల్ అతని మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని సిమ్రాన్ ఆవేదన చెందారు.
మోనాల్ సూసైడ్ చేసుకోవడానికి కొద్ది రోజుల ముందు ప్రసన్న సుజిత్ ఆమెకు బ్రేకప్ చెప్పినట్లు తెలిసింది. లవ్ బ్రేకప్ కారణంగా మోనాల్ అతి చిన్న ప్రాయంలో తనువు చాలించారు. మోనాల్ వర్ధంతి రోజు ఆమెను తలచుకుంటూ సిమ్రాన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నా ప్రియమైన సిస్టర్ మోనాల్. నువ్వు ఎప్పటికీ నా జ్ఞాపకాల్లో ఉండిపోతావు అంటూ.. మోనాల్ తో దిగిన ఫోటోలు సిమ్రాన్ షేర్ చేశారు.
దీంతో మోనాల్ ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది. ఇక సిమ్రాన్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది టాలీవుడ్ లోనే. ఆమె మొదటి చిత్రం అబ్బాయి గారి పెళ్లి. ఈ మూవీలో సుమన్ హీరోగా నటించారు. ఇక తెలుగులో సిమ్రాన్ అనేక ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ లో నటించారు. బాలయ్యకు జంటగా ఆమె నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు బాక్సాఫీస్ బద్దలు కొట్టాయి. సిమ్రాన్ తమిళ్ లో అధికంగా చిత్రాలు చేశారు. సిమ్రాన్ గొప్ప డాన్సర్.
In loving memory of my beautiful sister Monal. You’ll be never forgotten 😘 pic.twitter.com/4E78Ol6PZz
— Simran (@SimranbaggaOffc) April 14, 2023