https://oktelugu.com/

Roja Ramani: అందరికీ తెలిసేలా ఆర్తి అగర్వాల్ తో తిరగకు అని చెప్పాను… హీరో తరుణ్ తల్లి షాకింగ్ కామెంట్స్

తాజాగా తరుణ్ తల్లి రోజా రమణి ఈ రూమర్స్ పై కుండబద్దలు కొట్టారు. తరుణ్ తో పెళ్లి కాకపోవడం వల్లే ఆర్తి అగర్వాల్ డిప్రెషన్ లోకి వెళ్లిందా అన్న ప్రశ్న రోజా రమణికి ఎదురైంది.

Written By:
  • S Reddy
  • , Updated On : June 9, 2024 / 11:01 AM IST

    Roja Ramani

    Follow us on

    Roja Ramani: దివంగత నటి ఆర్తి అగర్వాల్, తరుణ్ ప్రేమ వ్యవహారం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్. ఆర్తి అగర్వాల్ – తరుణ్ రెండు సినిమాల్లో కలిసి నటించారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డారని, ఘాడంగా ప్రేమించుకున్నారని .. వీరి పెళ్ళికి తరుణ్ తల్లి అంగీకరించకలేదని అప్పట్లో మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఆర్తి అగర్వాల్ తీవ్ర డిప్రెషన్ కి గురైందట. ఆ కారణంగా ఆస్పత్రి పాలైందని ఎన్నో రూమర్స్ వచ్చాయి.

    కానీ అసలు నిజాలు ఇంతవరకు ఎవరికీ తెలియదు. అయితే తాజాగా తరుణ్ తల్లి రోజా రమణి ఈ రూమర్స్ పై కుండబద్దలు కొట్టారు. తరుణ్ తో పెళ్లి కాకపోవడం వల్లే ఆర్తి అగర్వాల్ డిప్రెషన్ లోకి వెళ్లిందా అన్న ప్రశ్న రోజా రమణికి ఎదురైంది. రోజా రమణి మాట్లాడుతూ .. తరుణ్ తో లవ్ ఎఫైర్ అనేది అసలు కారణం కాదు. దానికి వేరే రీజన్ ఉంది. తరుణ్, ఆర్తి అగర్వాల్ రిలేషన్ పై ఎన్నో రూమర్స్ వచ్చాయి.

    వాళ్లిద్దరూ కలిసి నటించింది రెండు సినిమాలే. అలా అనుకుంటే శ్రియ శరన్ తో తరుణ్ నాలుగు సినిమాలు చేశాడు. వాళ్లిద్దరూ చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. నన్ను శ్రియ ఆంటీ అని పిలుస్తూ ఉంటుంది. ఆర్తి అగర్వాల్ తో నాకు అంతగా పరిచయం లేదు. బహుశా ఒకటి రెండు సార్లు కలిశాను అంతే. కానీ తరుణ్ – ఆర్తి అగర్వాల్ పై సీరియస్ రూమర్స్ వచ్చాయి. మేము వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోకపోతే సమస్య ఏంటి .. వాళ్లిద్దరూ మేజర్స్ .. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని ఉండొచ్చు.

    లేదంటే పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుని ఉండొచ్చు. తరుణ్ నాతో ఎప్పుడూ ఆర్తి తో పెళ్లి గురించి ప్రస్తావించలేదు. నేను మాత్రం ఒకసారి తరుణ్ ని హెచ్చరించాను. మీ ఇద్దరి పై రూమర్స్ వస్తున్నాయి. అమ్మాయితో క్లోజ్ గా ఉంటే బయటకు తెలిసేలా ఎందుకు తిరగడం. కొంచెం జాగ్రత్త అని చెప్పాను. ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వాళ్లిద్దరూ నిజంగా ప్రేమించుకుని ఉంటే మాకు చెప్పాలి కదా అని రోజా రమణి అన్నారు. కాగా రోజా రమణి నటి, స్టార్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అప్పట్లో హీరోయిన్స్ కి ఆమె డబ్బింగ్ చెప్పారు.